హైదరాబాద్ : శాసనసభ ఎన్నికల సన్నాహకాలను కేంద్ర ఎన్నికల సంఘం ప్రారంభించిన
విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తులు షురూ చేసింది. ఈ
దఫా అన్నీ అత్యాధునిక నూతన ఈవీఎంలను వినియోగిస్తామని తెలంగాణ సీఈవో వికాస్‌రాజ్
తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో 1,500 మంది ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రం
ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర అసెంబ్లీకి ఈ ఏడాది చివర్లో జరిగే
ఎన్నికల కోసం అత్యాధునిక, నూతన ఓటింగ్ యంత్రాలను వినియోగిస్తామని తెలంగాణ
రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్ చెప్పారు. ఇప్పటికే 1,65,685
ఓటింగ్ యంత్రాలు (ఈవీఎంలు) అందాయన్న ఆయన రాష్ట్రంలో 2,99,77,659 మంది ఓటర్లు
ఉన్నారన్నారు. 34,891 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని పేర్కొన్న సీఈవో వికాస్
రాజ్
ఒక పోలింగ్ కేంద్రంలో 1,500 మంది ఓటర్లు మించకుండా జాగ్రత్తలు తీసుకుంటామని
తెలిపారు. ఓటర్లు పెరిగే కొద్దీ వాటి సంఖ్యా పెరుగుతుందని తెలంగాణ సీఈవో
వికాస్‌రాజ్ చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల కసరత్తు చేపట్టిన నేపథ్యంలో ఆయన
మాట్లాడారు.