హైదరాబాద్ : తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు
మరొక అంతర్జాతీయ ఆహ్వానం లభించింది. జర్మనీలోని బెర్లిన్ లో జరిగే ఏషియా
బెర్లిన్ సమ్మిట్ -2023 సదస్సుకి హాజరుకావాలని మంత్రి కేటీఆర్ కి నిర్వాహకులు
ఆహ్వానాన్ని అందించారు. ఈ సమావేశం జూన్ 12 నుంచి 15 వరకు జర్మనీలోని నగరంలో
జరుగుతుంది. కనెక్టింగ్ స్టార్ట్ అప్ ఈకో సిస్టం అనే అంశంపైన ఈ సమావేశం
జరుగుతుందని, ఈ సదస్సుకు హాజరు అయి, ప్రసంగించాలని మంత్రి కేటీఆర్ కి ఆహ్వానం
అందింది. జర్మనీకి సెనెట్ చెందిన ఎకనామిక్స్, ఎనర్జీ, పబ్లిక్ ఎంటర్ప్రైజ్ శాఖ
మంత్రి కేటీఆర్ కి ఆహ్వానం పంపింది. ఈ సదస్సులో ప్రసంగించడం ద్వారా భారత్ తో
పాటు తెలంగాణ మరియు ఇతర దేశాల మధ్య బలమైన భాగస్వామ్యాలను ఏర్పాటు
చేసుకోవడానికి అవసరమైన ప్రయత్నాలను బలోపేతం చేయాలని కోరింది. ప్రతి ఏటా ఈ
సదస్సు ద్వారా జర్మనీ మరియు అసియా దేశాల మధ్య ఆర్థిక సంబంధాలను,
భాగస్వామ్యాలను బలోపేతం చేసేందుకు నిర్వహిస్తారు. ముఖ్యంగా జర్మనీలో ఉన్న
స్టార్ట్ అప్ లను అసియా ఖండంలోని మార్కెట్లతో అనుసంధానం చేసేందుకు ఈ సదస్సు
ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ సంవత్సరం జరగనున్న సదస్సు మొబిలిటీ, లాజిస్టిక్స్,
ఎనర్జీ, గ్రీన్ టెక్, వాతావరణ మార్పులు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి
ప్రధానమైన అంశాలను విస్తృతంగా చర్చిస్తుందని తెలిపారు. దీంతోపాటు ఈ సమావేశంలో
భాగంగా పెట్టుబడిదారులకు ప్రత్యేకమైన సెషన్ ఉంటుందని, అద్భుతమైన ఐడియాలున్న
స్టార్ట్ అప్ కంపెనీలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని తెలిపింది. జర్మనీలో
ఉన్న స్టార్టప్ ఈకో సిస్టం బలాన్ని అసియా ఖండంలోని స్టార్ట్ అప్ లతో
పంచుకునేందుకు ఈ సదస్సు ఎంతగానో ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని నిర్వాహకులు మంత్రి
కేటీఆర్ కు పంపిన ఆహ్వానంలో పేర్కొన్నారు.