హైదరాబాద్ : భారాస పార్టీలోకి మహారాష్ట్ర నుంచి నాయకుల చేరికలు
కొనసాగుతున్నాయి. పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ నాయకత్వం, తెలంగాణలో అమలు
చేస్తున్న అభివృద్ధి, పథకాల పట్ల ఆకర్షితులైన మహారాష్ట్రకు చెందిన పలు పార్టీల
నాయకులు, విద్యావేత్తలు, సామాజిక కార్యకర్తలు భారాసలో చేరుతున్నారు.
హైదరాబాద్లోఎమ్మెల్యే బాల్క సుమన్ ఆధ్వర్యంలో విదర్భకు చెందిన పలువురు
కాంగ్రెస్, భాజపా నాయకులు కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకొన్నారు.
భారాసలోకి చేరిన వారిలో వార్ధా జిల్లా అర్వి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి
స్వరాజ్ షెట్కారీ సంఘటన్ మహారాష్ట్ర అధ్యక్షుడు శంకర్రావు బల్కెడే, బీజేపీ
వార్ధా జిల్లా యువమోర్చా నేత, ఓబీసీ నాయకురాలు జైకుమార్ బల్కెడే, యాదవరావ్
కేశవరావ్ బంగే, రాజ్బౌవ్ షెట్కాడె, నిరంజన్ పాటిల్ తదితరులున్నారు.
ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఆధ్వర్యంలో మరికొందరు మరాఠా నేతలు భారాసలో చేరారు.
వీరిలో బీజేపీ మహారాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు, కొల్హాపూర్ లోక్‌సభ మాజీ
జిల్లా కోఆర్డినేటర్ యువరాజ్ ఆనంద్‌రావు పాటిల్, చాంగడ్ టౌన్ కౌన్సిలర్,
కొల్హాపూర్ మాజీ జడ్పీ సభ్యులు ఆనంద్ బాలాసాహెబ్ హలందకర్, మాజీ ఎమ్మెల్యే
శంకర్ కౌలకర్ కుమారుడు, విద్యావేత్త సుశీల్ కౌలకర్, భాజపా కాగల్ తాలూకా
అధ్యక్షుడు సందీప్ కురులే, కర్వీర్ కాంగ్రెస్ నాయకులు కృష్ణ తనేకర్
తదితరులున్నారు.