పార్టీ కార్యాలయం నేడు ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు
పూర్తయ్యాయి. ఇవాళ మధ్యాహ్నం 1.05 నిమిషాలకు సీఎం కేసీఆర్ పార్టీ
కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు మంత్రులు,
బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, ఇతర నేతలు ఢిల్లీ కి పయనమయ్యారు. ఢిల్లీలో
బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. ఇవాళ ముఖ్యమంత్రి
కేసీఆర్ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. ఇందుకోసం నేడు కేసీఆర్ ఢిల్లీకి
బయలుదేరి వెళ్లనున్నారు. మూడు రోజుల పాటు సీఎం కేసీఆర్ హస్తినలోనే
ఉండనున్నట్లు సమాచారం. పలువురు నేతలతో భేటీ కావడం సహా పార్టీ విస్తరణకు
సంబంధించిన అంశాలపై దృష్టి సారించనున్నారు. ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు
మంత్రులు, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, ఇతర నేతలు ఢిల్లీ కి పయనమయ్యారు.
జాతీయ రాజకీయాల్లో క్రీయాశీలపాత్ర పోషించడమే లక్ష్యంగా పావులు కదుపుతున్న
ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు దేశరాజధానిలో భారత్ రాష్ట్రసమితి కార్యాలయ భవనాన్ని
ప్రారంభించనున్నారు.మధ్యాహ్నం తొలుత కార్యాలయంలో యాగం నిర్వహిస్తారు. అనంతరం
1.05 నిమిషాలకు కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. ఒకటిన్నర వరకు అక్కడే ఉంటారు.
ప్రారంభోత్సవానికి అవసరమైన ఏర్పాట్లను మంత్రి ప్రశాంత్‌రెడ్డి
పర్యవేక్షించారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు మంత్రులు, బీఆర్ఎస్ ప్రజా
ప్రతినిధులు, ఇతర నేతలు ఢిల్లీ కి బయలుదేరారు.
నిర్మాణం జరిగిన తీరు: దిల్లీ వసంత్ విహార్‌లో బీఆర్ఎస్ కార్యాలయ
నిర్మాణానికి 2020 అక్టోబరు 9న కేంద్ర పట్టణ వ్యవహారాలు, గృహ నిర్మాణ శాఖ 1315
గజాల స్థలం కేటాయించింది. ఆ స్థలానికి బీఆర్ఎస్ మార్కెట్ విలువ ప్రకారం రూ.
8,41,37,500 కోట్లు, వార్షిక స్థల అద్దె కింద రూ. 21,03,438 చెల్లించింది.
అనంతరం ఆ స్థలంలోని చిన్నపాటి కొండ తొలగించి కార్యాలయ నిర్మాణానికి అనువుగా
మార్చారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆ కార్యాలయ నిర్మాణానికి 2021 సెప్టెంబరు
2న భూమి పూజ చేశారు. నిర్మాణ పనులను ఎండీపీ ఇన్ఫ్రాసంస్థకు అప్పగించారు.
రెండేళ్లలోపే కార్యాలయ నిర్మాణాన్ని పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు
కార్యాలయాన్ని ఐదు అంతస్తుల్లో నిర్మించారు. 20వేల అడుగుల విస్తీర్ణంలో
నిర్మించిన ఆ కార్యాలయంలో లోయర్‌గ్రౌండ్, గ్రౌండ్ ఫ్లోర్‌తోపాటు
మూడుఅంతస్తుల్లో కార్యాలయాలు, కాన్ఫరెన్స్ హాళ్లు, అతిధుల గదులు నిర్మించారు.