రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్
హైదరాబాద్ : దర్యాప్తు వేగవంతంగా జరగడానికి వైజ్ఞానిక, శాస్త్రీయ ఆధారాలు ఎంతో
ఉపయోగపడతాయని రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్ అన్నారు. కేసు దర్యాప్తు
చేసినప్పుడు మానవ హక్కుల నియమాలు దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు. ఈ మేరకు
రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్ల అధికారులు, డీఎస్పీలతో ఆయన వీడియో
కాన్ఫరెన్స్ నిర్వహించారు.