మంజూరు ఇస్తూ ఫైల్స్ పై సంతకం చేసిన మంత్రి సత్యవతి రాథోడ్.
శాస్త్రోక్తంగా కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి
సత్యవతి రాథోడ్
మంత్రి సత్యవతి రాథోడ్ కి వేదపండితుల ఆశీర్వచనం
హైదరాబాద్ : నూతనంగా నిర్మించిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర
సచివాలయంలోని తన ఛాంబర్ లో రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి
సత్యవతి రాథోడ్ ఆశీనులు అయ్యారు. అంగన్వాడి కేంద్రాలకు సన్నబియ్యం పంపిణీతో
పాటు రాంజీగోండు మ్యూజియానికి 10 కోట్లరూపాయల మంజూరు ఇస్తూ ఫైల్స్ పై మంత్రి
సత్యవతి రాథోడ్ సంతకం చేశారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ
దేశంలో ఎక్కడా లేనివిధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అంగన్వాడీల ద్వారా లబ్ధి
పొందుతున్న చిన్నారులకు, గర్భిణీలకు ఇకపై సన్నబియ్యంతో భోజనం అందించడం
జరుగుతుందని తెలిపారు. చిన్నారులకు, గర్భిణీలకు కడుపునిండా అన్నం పెట్టడమే
లక్ష్యంగా సన్న బియ్యం అందించ బోతున్నామని తెలిపారు. హాస్టల్ విద్యార్థులకు
సన్న బియ్యం పథకం ప్రవేశపెట్టడమే కాకుండా అంగన్వాడీ కేంద్రాలకు సైతం
సన్నబియ్యం సరఫరా చేసి రుచికరమైన భోజనాన్ని అందిస్తున్నామని పేర్కొన్నారు.
చరిత్రలో ఎక్కడ లేని విధంగా గర్భిణులు, బాలింతలు, శిశువుల ఆరోగ్య రక్షణకు
రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 35,700
అంగన్ వాడీ కేంద్రాల ద్వారా 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు
15,01199 మంది లబ్ధి పొందుతున్నారని తెలిపారు.
4 లక్ష ల36,035 మంది గర్భిణీలు, బాలింతలు ఇకపై సన్న బియ్యంతో చేసిన నాణ్యమైన
భోజనాన్ని అందించబోతున్నామని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అంగన్వాడి
కేంద్రాలకు
30 వేల మెట్రిక్ టన్నుల సన్న బియ్యం అవసరం ఉండగా, ప్రతి నెల 2వేల 500 మెట్రిక్
టన్నులు అందించడం జరుగుతుందని స్పష్టం చేశారు. గతంలో అంగన్వాడి కేంద్రాలకు
దొడ్డు బియ్యం కోసం 14.64 కోట్లు ఖర్చు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడు
సన్నబియ్యం కోసం 18.36 కోట్లు అదనంగా ఖర్చు చేస్తుందని మంత్రి తెలిపారు.
అంతేకాకుండా అంగన్వాడీల ద్వారా పోషకాహారం, వ్యాధినిరోధక టీకాల కార్యక్రమం,
ఆరోగ్యంపై కౌన్సెలింగ్, రిఫరల్ సేవలు, పూర్వ ప్రాథమిక విద్య మొదలగు సేవలతో ఐ
సీ డీ ఎస్ అంగన్ వాడీ సేవల పథకం ద్వారా అందించడం జరుగుతుందని పేర్కొన్నారు.
అంగన్వాడీల ద్వారా గర్భిణీలకు బాలింతలకు చిన్నారులకు సన్న బియ్యంతో భోజనాన్ని
అందిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కి సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్
హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసారు.
అనంతరం హైదరాబాద్ అబిడ్స్ లో రాంజీ గోండు స్మారక మ్యూజియం ఏర్పాటుకు10 కోట్ల
నిధులు
మంజూరు ఇస్తున్న ఫైల్ పై మంత్రి సంతకం చేశారు. రాంజీగోండు, కుంరం భీం
పోరాటాలు, త్యాగాలే నేటి గిరిజన ఆదివాసీ సమాజానికి సంక్షేమ, అభివృద్ధి
ఫలాలు అందిస్తున్నాయని మంత్రి తెలిపారు. వారి స్ఫూర్తితోనే గౌరవ ముఖ్యమంత్రి
కేసీఆర్ గారు గిరిజనుల అభివృద్ధి, సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు
ప్రవేశపడుతున్నారని స్పష్టం చేశారు.1857 సిపాయి తిరుగుబాటు సమయంలో గిరిజనుల
హక్కులు.. బ్రిటిష్, నిజాం సైన్యం పెత్తనాన్ని రాంజీగోండు ఎదిరించిన
మహాయోధుడని అభివర్ణించారు. దేశ ప్రథమ స్వాతంత్ర్య పోరాటం తరువాత
బ్రిటిష్-నిజాం నిరంకుశత్వాలకు ఎదురొడ్డి ప్రాణాలర్పించిన ఘనత తొలి వీర
యోధుడిగా రాంజీగోండుకే దక్కిందని పేర్కొన్నారు. అయితే ఇంతటి వీరోచితపోరాట
చరివూతను గత పాలకులు నిర్లక్ష్యం చేశారని మంత్రి విమర్శించారు. గౌరవ
ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రత్యేక రాష్ట్రంలో తెలంగాణ మూలాలను వెతుక్కుంటూ..
తన చరివూతను పునర్ నిర్మించుకుంటున్న తరుణంలో రాంజీగోండు చరిత్రను వెలుగులోకి
తేవాలని నిర్ణయించారు. ఈ నేపధ్యంలో రాంజీగోండు గిరిజన మ్యూజియంకు కేంద్ర
ప్రభుత్వం 10 కోట్లు మంజూరు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం 10 కోట్లు మంజూరు
ఇచ్చిందని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు.
అనంతరం మంత్రి సత్యవతి రాథోడ్ గారికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, తెలంగాణ
శాసనమండలి డిప్యూటీ చైర్మన్
బండ ప్రకాష్ ముదిరాజ్, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పోచంపల్లి శ్రీనివాస్
రెడ్డి, అలుగుబెల్లి నర్సిరెడ్డి, ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్, ఆరూరి
రమేష్, పెద్ది సుదర్శన్ రెడ్డి, శంకర్ నాయక్, నన్నపనేని నరేందర్, రేఖానాయక్,
గువ్వల బాలరాజు, హరిప్రియ నాయక్, సోయం బాపురావు, బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి,
గండ్ర వంకటరమణారెడ్డిఈ వెంకటరమణారెడ్డి, ఎంపీలు మాలోత్ కవిత, పసునూరి దయాకర్
రావు, జడ్పీ చైర్మన్లు కుమారి అంగోత్ బిందు, జగదీష్ కుమార్, సంపత్ రెడ్డి,
సుధీర్ రెడ్డి,జీసిసి చైర్మన్ వాల్య నాయక్, ట్రై కార్ చైర్మన్ రామచంద్రనాయక్,
గిరిజన సంక్షేమ శాఖ గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చొంగ్తు,
మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి భారతి హోలీ కేరి ,కలెక్టర్లు
శశాంక, భవిష్ మిశ్రా, కృష్ణ ఆదిత్య, ఎస్పీలు శరత్ చంద్రపవార్, గౌష్ ఆలం
మంత్రిని కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.