తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
హైదరాబాద్ : హైదరాబాద్ నాంపల్లి పాఫ్సీ భవన్లో “వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతి
అవకాశాలు – తెలంగాణ” అంశంపై సదస్సుకు ముఖ్య అతిథిగా వ్యవసాయ శాఖ మంత్రి
సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ ఉత్పత్తుల్లో
దేశంలో అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణ ముందుందన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల
ప్రాసెసింగ్ యూనిట్లపై మంచి విధానాన్ని రూపొందించి ప్రభుత్వం ముందుపెడితే..
దాన్ని స్వల్ప సమయంలోనే అమల్లోకి తీసుకొస్తామన్నారు. ఇతర దేశాలతో సంబంధాలు
మానవుల మనుగడకు అవసరం అని వ్యాఖ్యానించారు.