తెలంగాణ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్
హైదరాబాద్ : యాసంగి ధాన్యం కొనుగోళ్లు ఈ ఏడాది గత సంవత్సరం ఇదే సమయానికన్నా
రెట్టింపు మించి కొనుగోళ్లు జరిగాయని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్
అన్నారు. ఇటీవల అకాల వర్షాల నేపథ్యంలో యాసంగి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ,
కొత్త కేంద్రాల ఏర్పాటు, ఇతర ఇబ్బందులపై అధికారులతో కలిసి ఆయన ఉన్నత స్థాయి
సమీక్ష నిర్వహించారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా
ఉంటుందని మంత్రి భరోసా ఇచ్చారు.