హైదరాబాద్ : బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావడమనేది పెద్ద విషయం కాదని,
మునుపటికి మించి సీట్లు రావటమనేదే ప్రాధాన్యతాంశమని ఆ పార్టీ అధినేత,
ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్ఘాటించారు. దూపయినప్పుడే బాయి తవ్వుతమనే రాజకీయం నేటి
కాలానికి సరిపోదన్న ఆయన క్యాడర్లో అసంతృప్తిని తగ్గించే చర్యలు చేపట్టాలని
పార్టీ నేతలకు హితబోధ చేశారు. పార్టీ ఆవిర్భావ వేడుకలో భాగంగా హైదరాబాద్
తెలంగాణ భవన్లో జరిగిన ప్రతినిధుల సమావేశంలో ఈ మేరకు కేసీఆర్ బీఆర్ఎస్
నేతలకు దిశానిర్దేశం చేశారు.

డబ్బులు వసూలు చేసే ఎమ్మెల్యేలకు ఇదే చివరి వార్నింగ్
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న దళిత బంధు పథకం అమలు
అంశంపై సీఎం కేసీఆర్ తీవ్రంగా స్పందించారు. దళితబంధుపై ప్రతిపక్షాల నుంచి
ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో సొంత పార్టీ ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి వార్నింగ్
ఇచ్చారు. డబ్బులు వసూలు చేసే ఎమ్మెల్యేల జాబితా తన దగ్గరు ఉందని అన్నారు.
ఇంకోసారి తప్పు చేస్తే పార్టీ నుంచి తొలగిస్తామని గట్టిగా హెచ్చరించారు.