హైదరాబాద్ : మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి ఆస్తులపై వైతెపా
అధ్యక్షురాలు షర్మిల స్పందించారు. ఆయనపై చేస్తున్న తప్పుడు ఆరోపణలను తీవ్రంగా
ఖండిస్తున్నట్టు చెప్పారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ వివేకా పేరుపై
ఉన్న ఆస్తులన్నీ ఎప్పుడో సునీత పేరు మీదే రాశారని తెలిపారు. ‘‘ఆస్తులన్నీ
ఎప్పట్నుంచో సునీత పేరు మీదే ఉన్నాయి. సునీత పేర ఆస్తులన్నీ ఉంటే వేరే వారికి
రాస్తారనడంలో అర్థమే లేదు. ఆస్తుల కోసమే వివేకా అల్లుడు రాజశేఖర్రెడ్డి హత్య
చేశారనుకుంటే చంపాల్సింది. వివేకాను కాదు సునీతను. మా చిన్నాన్న పేరిట ఉన్న
అరకొర ఆస్తులూ సునీత పిల్లలకే రాశారు. వివేకానందరెడ్డి ప్రజల మనిషి.
పులివెందుల, కడప జిల్లా ప్రజలకు ఆయన గురించి తెలుసు. ఆయన సాధారణ జీవితం
గడిపారు. కొన్ని మీడియా సంస్థలు ఆయన వ్యక్తిగత జీవితం గురించి తక్కువ చేసి
మాట్లాడుతున్నాయి. మా చిన్నాన్న పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడే అర్హత ఎవరికీ
లేదు. ఆయనపై చేస్తున్న తప్పుడు ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నానని షర్మిల
చెప్పారు.