కేసీఆర్ నాయకత్వం దేశానికి అత్యవసరమని ప్రజలు భావిస్తున్నారు
సోదరులు,కుటుంబ సభ్యులతో కలిసి ఎల్లమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు
చేసిన ఎంపీ రవిచంద్ర
హైదరాబాద్ : బంధుమిత్రులు, శ్రేయోభిలాషులకు విందు ఇచ్చిన ఎంపీ రవిచంద్ర
తెలంగాణ రాష్ట్రం మాదిరిగానే దేశం సుభిక్షంగా ఉండాలని రాజ్యసభ సభ్యులు
వద్దిరాజు రవిచంద్ర బల్కంపేట ఎల్లమ్మ తల్లిని వేడుకున్నారు.ముఖ్యమంత్రి
కేసీఆర్ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి, సంక్షేమానికి పలు పథకాలు ప్రవేశపెట్టి
విజయవంతంగా అమలు చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. వద్దిరాజు వంశస్తులు తమ
కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో ఆదివారం బల్కంపేట ఎల్లమ్మ పోచమ్మ తల్లులను
దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వద్దిరాజు రవిచంద్ర, విజయలక్ష్మీ,కిషన్,
శశిరేఖ,దేవయ్య,ఇందిర, వెంకటేశ్వర్లు, ఉమామహేశ్వరి దంపతులు,వారి కుటుంబ సభ్యులు
భక్తి ప్రపత్తులతో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రవిచంద్ర
తెలంగాణ మాదిరిగానే దేశం కూడా సుభిక్షంగా ఉండేలా, కేసీఆర్ నిండూ నూరేళ్లు
ఆయురారోగ్యాలతో చల్లగా జీవించేలా చూడాల్సిందిగా ఎల్లమ్మ తల్లిని వేడుకున్నారు.
తెలంగాణ అన్ని రంగాలలో ప్రగతిపథాన పరుగులు పెడుతుండడాన్ని చూసి కేసీఆర్
సమర్థవంతమైన నాయకత్వం, సుపరిపాలన తమకు కూడా కావాలని యావత్ దేశ ప్రజలు
కోరుకుంటున్నారని ఎంపీ వద్దిరాజు వివరించారు. ఆలయ ముఖద్వారం వద్ద వద్దిరాజు
వంశస్తులకు ఇవో అన్నపూర్ణ, వేదపండితులు,అధికారులు మంగళ వాయిద్యాలు,
పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు.
రికి వేద పండితులు అమ్మ వారి శేష వస్త్రాలు,తీర్థ ప్రసాదాలు బహుకరించి
ఆశీర్వదించారు.వీరితో పాటు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు,
అభిమానులు పెద్ద సంఖ్యలో ఎల్లమ్మ తల్లిని దర్శించుకున్నారు. అనంతరం వారందరికి
రవిచంద్ర విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సుమారు 300మంది హాజరయ్యారు.
ఎల్లమ్మ తల్లిని దర్శించుకున్న వారిలో జల వనరుల అభివృద్ధి సంస్థ ఛైర్మన్
వి.ప్రకాష్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సర్థార్ పుటం పురుషోత్తం రావు, ఆర్జేసీ
కృష్ణ,గుండ్లపల్లి శేషగిరిరావు, ప్రముఖ వాస్తుశిల్పి ముద్దు వినోద్, మున్నూరు
కాపు ప్రముఖులు కనకయ్య,విష్ణు జగతి,తూడి ప్రవీణ్,మరికల్ పోత సుధీర్ కుమార్,
పత్తి శ్రీనివాస్, వెంపటి ఉపేందర్,భద్రి గోరెంట్ల,యువ తేజాలు కార్తీక్, నానబాల
హరీష్, జెన్నాయి కోడే జగన్మోహన్, గుమ్మడెల్లి హరీష్, జెన్నాయికోడే
చంద్రశేఖర్,గుమ్మడెల్లి ప్రశాంత్, ఎంపీ రవిచంద్ర తమ్ముళ్లు మోహన్, పెద్ద
వెంకన్న, శ్రీనివాస్, సన్నిహితులు రాంచంద్రారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి,
సికిందర్ రెడ్డి తదితరులు ఉన్నారు.