హైదరాబాద్ : శ్రీ శారదా నృత్య నికేతన్ లో శిక్షణ పొందిన బూసం ధీత్యా రెడ్డి
ఈనెల 21వ తేదీన శుక్రవారం సాయంత్రం 6గంటలకు హైదరాబాద్ రవీంద్ర భారతిలో
కూచిపూడి నృత్య రంగ ప్రవేశం చేయనుంది. గురువు శ్రీమతి శైలజా ప్రసాద్ వద్ద
ధీత్యా రెడ్డి శిక్షణ పొందారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ
సలహాదారు కే .వీ రమణాచారి ముఖ్య అతిధిగా హాజరు కానుండగా గౌరవ అతిధులుగా
కన్సల్టెంట్ సైకాలజిస్ట్ డాక్టర్ బీ.వీ పట్టాభిరామ్, డాక్టర్ పార్వతి
వర్దిని, విజయవాడ ఇండ్ల హాస్పిటల్స్ డైరెక్టర్ డాక్టర్ ఇండ్ల రామ సుబ్బారెడ్డి
హాజరు కానున్నట్లు ధీత్యా రెడ్డి తల్లిదండ్రులు బూసం రవికాంత్ రెడ్డి , సునీత
తెలిపారు. కందచపు తాళం గంభీరనాట రాగంలో శ్రీ విజ్ఞ రాజం భజే, ఆది తాళం కురంజి
రాగంలో ముద్దుగారే యశోదా, ఆది తాళం ఆరభి రాగంలో దశావతార అష్టపడి, మిస్రచాపు
తాళం భైరవి రాగంలో భామా కలాపం, ఆది తాళం రాగమాలిక రాగంలో మరకత మణిమయ చేల, ఆది
తాళం నీలాంబరి రాగంలో శృమ్గార లహరి కృతి, అది తాళం ధనశ్రీ రాగంలో థిల్లానా ,
మంగళం నృత్య ప్రదర్శనలో ఉంటాయి.