హైదరాబాద్ : మాజీ మంత్రి వివేకా హత్య కేసులో అరెస్టయిన నిందితులు వైఎస్
భాస్కరరెడ్డి, ఉదయ్కుమార్రెడ్డిలను సీబీఐ అధికారులు కస్టడీకి తీసుకున్నారు.
చంచల్గూడ జైలులో ఉన్న నిందితులను ఉస్మానియా ఆస్పత్రికి తరలించి వైద్య
పరీక్షలు నిర్వహించారు. అనంతరం విచారణ నిమిత్తం కోఠిలోని సీబీఐ కార్యాలయానికి
తరలించారు. ఇటీవల అరెస్ట్ చేసిన భాస్కరరెడ్డి, ఉదయ్ కుమార్రెడ్డిలను 10
రోజులపాటు కస్టడీకి ఇవ్వాలంటూ సీబీఐ పిటిషన్లు దాఖలు చేసింది. దీనిపై విచారణ
చేపట్టిన సీబీఐ న్యాయస్థానం వాళ్లిద్దరినీ కస్టడీకి అప్పగిస్తూ మంగళవారం
ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 19 నుంచి 24 వరకు ఆరు రోజులపాటు కస్టడీకి
అప్పగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారణ
నిమిత్తం చంచల్గూడ జైలు నుంచి కస్టడీకి తీసుకోవడానికి అనుమతిస్తున్నట్లు
న్యాయమూర్తి పేర్కొన్నారు.