రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్
హైదరాబాద్ : అంబేడ్కర్ పేరును పార్లమెంటుకు పెట్టాలన్న దేశవ్యాప్త డిమాండ్లను
కేంద్రం పట్టించుకోవట్లేదని రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్
ఆక్షేపించారు. సీఎం కేసీఆర్ తెలంగాణ సచివాలయానికి అంబేడ్కర్ పేరు పెట్టి
గౌరవించారని కొనియాడారు. వారం రోజుల పాటు రాష్ట్రంలో అంబేడ్కర్ వారోత్సవాలు
నిర్వహించాలని తెలిపారు.