హైదరాబాద్ : ప్రజారోగ్య పరిరక్షణ, వైద్యారోగ్యరంగ అభివృద్ధి దిశగా ప్రభుత్వం
చేపట్టిన చర్యలతో రాష్ట్రం ఆరోగ్య తెలంగాణగా అవతరించిందని ముఖ్యమంత్రి కేసీఆర్
పేర్కొన్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రజలంతా
ఆయురారోగ్యాలతో జీవించాలని ఆయన ఆకాంక్షించారు. వైద్య ఆరోగ్య రంగంలో తెలంగాణ
సాధించిన ప్రగతి దేశానికే ఆదర్శమని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ప్రజారోగ్య
పరిరక్షణ, వైద్య ఆరోగ్య రంగంలో అభివృద్ధి దిశగా ప్రభుత్వం చేపట్టిన చర్యలతో
రాష్ట్రం ఆరోగ్య తెలంగాణగా అవతరించిందని సీఎం తెలిపారు. ప్రపంచ ఆరోగ్య
దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రజలంతా ఆయురారోగ్యాలతో జీవించాలని ఆయన
ఆకాంక్షించారు. హైదరాబాద్, వరంగల్ వంటి ముఖ్య పట్టణాల్లో సూపర్ స్పెషాలిటీ
ఆసుపత్రుల నిర్మాణంతో కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ వైద్యం అందించేందుకు కృషి
చేస్తున్నామని కేసీఆర్ చెప్పారు. నిమ్స్ ఆస్పత్రిని 2వేల 500 పడకలతో
విస్తరిస్తున్నట్లు వివరించారు. కేంద్రం ప్రకటించిన అన్ని ఆరోగ్య సూచికల్లో
జాతీయ స్థాయి కంటే తెలంగాణ మెరుగ్గా ఉండడం స్వరాష్ట్రంగా తెలంగాణ సాధించిన
ఘనతగా కేసీఆర్ అభివర్ణించారు.