మహిళా రెజ్లర్లు బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశాన్ని పరిగణనలోకి
తీసుకున్న క్రీడా మంత్రిత్వ శాఖ, వారి ఆరోపణలపై 72 గంటల్లో సమాధానం ఇవ్వాలని
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాను కోరింది. ఫెడరేషన్ ప్రెసిడెంట్, కోచ్‌లపై
మహిళా రెజ్లర్లు లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. ప్రెస్ కాన్ఫరెన్స్
నిర్వహించిన రెజ్లర్లలో ఒలింపిక్ , కామన్వెల్త్ గేమ్స్ పతక విజేతలు కూడా
ఉన్నారు. ఈ విషయం అథ్లెట్లకు సంబంధించినదని, కాబట్టి తమ మంత్రిత్వ శాఖ దీనిని
చాలా సీరియస్‌గా తీసుకుంటోందని క్రీడా మంత్రిత్వ శాఖ తెలిపింది. రెజ్లింగ్
ఫెడరేషన్ ఆఫ్ ఇండియా 72 గంటల్లోగా స్పందించకపోతే, నేషనల్ స్పోర్ట్స్
డెవలప్మెంట్ కోడ్, 2011 నిబంధనల ప్రకారం సమాఖ్యపై మంత్రిత్వ శాఖ చర్యలు
తీసుకుంటుందని మంత్రిత్వ శాఖ తెలిపింది.

లక్నోలో జనవరి 18 నుంచి ప్రారంభం కానున్న మహిళల జాతీయ రెజ్లింగ్ కోచింగ్
క్యాంపును క్రీడా మంత్రిత్వ శాఖ రద్దు చేసింది. ఈ శిబిరంలో 41 మంది మహిళా
రెజ్లర్లు, 13 మంది కోచ్‌లు, సహాయక సిబ్బంది పాల్గొనాల్సి ఉంది. లక్నోలోని
నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఇప్పటికే
శిబిరం కోసం అక్కడికి చేరుకున్న మహిళా రెజ్లర్లకు క్యాంపులో ఉన్నంత వరకు
అన్ని సౌకర్యాలు కల్పించాలని క్రీడా మంత్రిత్వ శాఖ డైరెక్టర్‌ను ఆదేశించింది.