టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో
శుక్రవారం ఉదయం కోల్‌కతా నుంచి బెంగళూరుకు చేరుకున్నారు. అదే సమయంలో భారత
ఆటగాళ్లతో పాటు శ్రీలంక జట్లు, సహాయక సిబ్బంది మూడో వన్డే కోసం తిరువనంతపురం
బయలుదేరింది. స్వల్ప ఆరోగ్య సమస్యలతో శుక్రవారం తెల్లవారు జామున కోల్‌కతా
నుంచి బెంగళూరుకు విమానంలో బయలుదేరారు. డో వన్డే జరుగుతున్న సమయంలో బ్లడ్
ప్రెజర్‌కు సంబంధించి ఫిర్యాదు చేయడంతో బెంగాల్ క్రికెట్ అసోసియేషన్
వైద్యులు పరీక్షలు చేశారు. ప్రస్తుతం ద్రవిడ్ ఆరోగ్యం గురించి ఆందోళన
చెందాల్సిన అవసరం లేదని, పూర్తిగా క్షేమంగా ఉన్నాడని, పరీక్షల అనంతరం శనివారం
జట్టుతో చేరవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. బెంగళూరు విమానంలో ద్రవిడ్‌కు
సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఫొటోల్లో ద్రవిడ్
ఫిట్‌గానే ఉన్నట్లు కనిపిస్తున్నది. ఈ నెల 11తో రాహుల్ ద్రవిడ్కి 50
సంవత్సరాలు నిండాయి. బ్లడ్ ప్రెజర్ నేపథ్యంలో ముందు జాగ్రత్తగా పరీక్షల కోసం
బెంగళూరుకు వైద్యులను సంప్రదించేందుకు వెళ్లినట్లు సమాచారం.