టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా, పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్ వైవాహిక
జీవితం మరిన్ని విభెదాలకు దారి తీస్తోంది. వీరి మధ్య అనుబంధం ఇంతకుముందు
మాదిరి లేదని సానియా మీర్జా సోషల్ మీడియా పోస్ట్ లు చూస్తే అర్థమవుతోంది.
వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారంటూ గత కొంత కాలం నుంచి ఒక ప్రచారం
నడుస్తోంది. దీన్ని సానియా, షోయబ్ ఖండించలేదు. అలా అని ధ్రువీకరించలేదు. మౌన
వ్రతాన్ని కొనసాగిస్తున్నారు. దీంతో పనీ పాటలేని వారు మరింత కల్పిత ప్రచారం
సృష్టించేందుకు అవకాశం ఇచ్చినట్టయింది. సానియా మీర్జా ఇటీవలే తన ఇన్ స్టా
గ్రామ్ స్టోరీస్ లో ఓ ఆలోచనాత్మక పోస్ట్ పెట్టింది. ‘‘మా సరిహద్దులు అన్నవి
ఇతరులు నిర్ణయించేవి కావు. వారు ఎంతో సులభంగా మా అవసరాలను
నిర్ణయించేస్తున్నారు. నేను ఒకరితో దూరం పెంచుకున్నాను అంటే అది వారి తప్పు
కాదు. కొన్ని సందర్భాల్లో వారి ప్రవర్తన నాకు సరిగ్గా అనిపించకపోవచ్చు’’ అని
సానియా మీర్జా పేర్కొంది. అంటే తన భర్త షోయబ్ తో తనకు అంతరం ఏర్పడినట్టు ఆమె
పరోక్షంగా అంగీకరించింది. ఈ జంట విడాకుల కోసం ప్రయత్నిస్తున్నట్లు పుకార్లు
వచ్చాయి. కానీ, సానియా మరియు షోయబ్ విడాకుల గురించి పుకార్లను ధృవీకరించలేదు
లేదా ఖండించలేదు.