బంగ్లాదేశ్ పర్యటనలో భాగంగా టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తొలి టెస్టులో
8 వికెట్లతో చెలరేగాడు. బంగ్లా జట్టును దెబ్బతీసి భారత్ ఘన విజయంలో కీలక పాత్ర
పోషించాడు.ఈ మ్యాచ్ లో అతడి ప్రదర్శనకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా
దక్కింది. కానీ, అనూహ్యంగా రెండో టెస్టులో అతడిని టీమ్ మేనేజ్మెంట్
పక్కనబెట్టింది. తాజాగా ఈ వివాదంపై కుల్దీప్ కోచ్ కపిల్ పాండే ఆసక్తికర
వ్యాఖ్యలు చేశాడు. కుల్దీప్ ను పక్కనబెట్టడంతో తాను ఏడ్చానని, అసలు అతనికే
ఎందుకిలా జరుగుతుందో అర్థం కావడం లేదని అన్నాడు. బంగ్లా పర్యటన ముగించుకుని
స్వదేశానికి చేరుకున్న తర్వాత కపిల్ మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేశాడు.
‘కుల్దీప్ చాలాకాలంగా జట్టులో చోటు దక్కించుకుంటున్నా బెంచ్ కే పరిమితం
అవుతున్నాడు. అడపాదడపా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నాకీలక మ్యాచ్
లలో అతడిని పక్కనబెడుతున్నారు. కుల్దీప్ నాకు చిన్నప్పట్నుంచి తెలుసు.
వన్డేల్లో అతడికి రెండు హ్యాట్రిక్ (ఇండియా ఏ, అండర్ -19 జట్టుకు ఆడినప్పుడు)
లు ఉన్నాయి. అయినా టీమ్ మేనేజ్మెంట్ పట్టించుకోవడం లేదు.’ అని కపిల్ అన్నాడు.