ఉత్తరాఖండ్‌లో క్రికెటర్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదానికి గురైన విషయం
తెలిసిందే.. ఉత్తరా ఖండ్ నంచి ఢిల్లీ వెళ్తుండగా రూర్కీ వద్ద కారు అదుపుతప్పి
డివైడర్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారు దగ్ధం అయింది. దీన్ని గమనించిన
స్థానికులు పంత్‌ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం పంత్‌కు
వైద్యులు చికిత్స అందిస్తున్నారు. పంత్ కాలుకు తీవ్ర గాయాలు అయినట్లు
తెలుస్తోంది. పంత్ కు ప్లాస్టిక్ సర్జరీ చేయవలసి ఉంటుందని వైద్యులు
చెప్పినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రిషబ్ ఆరోగ్యం నిలకడగానే ఉందని.. ఢిల్లీ
లోని హాస్పిటల్ కి రెఫర్ చేస్తామని వైద్యులు తెలిపారు. ఇక ఈ వాహనం డివైడర్ ని
ఢీ కొనగానే మంటలు అంటుకున్నాయని, అతి కష్టం మీద వాటిని ఆర్పారని తెలుస్తోంది.
కారును రిషబ్ పంతే స్వయంగా డ్రైవ్ చేసినట్లు తెలుస్తోంది. పంత్ కు యాక్సిడెంట్
జరగడంతో అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. ముంబైలోని బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్
క్రికెట్ ఇన్ ఇండియా (BCCI) ప్రధాన కార్యాలయానికి భారత వికెట్ కీపర్
బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్ ఆరోగ్య పరిస్థితిపై నవీకరణలు (అప్డేట్స్) కోరుతూ
దేశవ్యాప్తంగా అభిమానుల నుంచి నిరంతరం కాల్స్ వస్తున్నాయి.