వచ్చే నెలలో శ్రీలంకతో జరగనున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్, 3 వన్డేల సిరీస్
కోసం బీసీసీఐ టీమిండియాను ప్రకటించింది. టీ20 సిరీస్‌లో టీమిండియాకు హార్దిక్
పాండ్యా కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. కాగా, సూర్యకుమార్ యాదవ్‌కు వైస్
కెప్టెన్సీ దక్కింది. అదే సమయంలో వన్డే సిరీస్‌లో రోహిత్ శర్మ టీమిండియాకు
కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. శివమ్ మావి, ముఖేష్ కుమార్, రాహుల్ త్రిపాఠి
వంటి యువ ఆటగాళ్లు టీ20 సిరీస్‌కు టీమిండియాలో అవకాశం దక్కించుకున్నారు. అదే
సమయంలో కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ టీ20 సిరీస్‌లో టీమ్ ఇండియాలో భాగం కావడం
లేదు. దీంతో పాటు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా, జస్ప్రీత్
బుమ్రా కూడా టీ20 సిరీస్‌లో ఆడడం లేదు. వన్డే సిరీస్‌లో రోహిత్ శర్మకు
హార్దిక్ పాండ్యా డిప్యూటీగా ఎంపికయ్యాడు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ
నిర్ణయం తీసుకున్నారు. అయితే వన్డే సిరీస్‌లోనూ రిషబ్ పంత్, రవీంద్ర జడేజా,
జస్ప్రీత్ బుమ్రా చోటు దక్కించుకోలేదు. అయితే వన్డే సిరీస్‌లో విరాట్ కోహ్లీ,
కేఎల్ రాహుల్ ఎంపికయ్యారు. అదే సమయంలో మహమ్మద్ షమీ వన్డే జట్టులోకి తిరిగి
వచ్చాడు. వన్డే సిరీస్‌లో శిఖర్ ధావన్‌కు టీమిండియాలో చోటు దక్కకపోవడం
ఆశ్చర్యకరం. ఇంతకుముందు, చాలా సందర్భాలలో ధావన్ వన్డే ఫార్మాట్లో టీమిండియాకు
కెప్టెన్‌గా ఉన్న విషయం తెలిసిందే.
టీమిండియా టీ20 జట్టు : హార్దిక్ పాండ్యా (కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్
(వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, శుభ్‌మాన్ గిల్, దీపక్ హుడా,
రాహుల్ త్రిపాఠి, సంజు శాంసన్, వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చాహల్, అక్షర్
పటేల్, అర్ష్‌దీప్ సింగ్, హర్షల్ పలెట్, ఉమ్రాన్ మాలిక్, శివమ్ మావి, ముఖేష్
కుమార్.
టీమిండియా వన్డే జట్టు : రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్
కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్),
ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), వాషింగ్టన్
సుందర్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, మహ్మద్ షమీ,
మొహమ్మద్. సిరాజ్, ఉమ్రాన్ మాలిక్,అర్ష్‌దీప్ సింగ్.