ఫిఫా వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ట్రోఫీతో కలిసి దిగిన ఫోటోను లియోనల్ మెస్సీ
ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. ఈ ఫోటోకు మూడు రోజుల్లో 68 మిలియన్ల లైకులు
వచ్చేశాయి. గతంలో బంగారు వర్ణంలో ఓ గుడ్డును ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేస్తే
ఆ ఫోటోకు 57 మిలియన్ల లైకులు వచ్చాయి. ఇక ప్రపంచంలో అత్యధిక లైకులు పొందిన
పోస్టుగా ఈ ఫోటో వరల్డ్ రికార్డు క్రియేట్ చేసింది. మూడేళ్లు ఈ రికార్డు
చెక్కు చెదరకుండా ఉంది. అయితే ప్రస్తుతం మెస్సీ ఈ రికార్డును బద్దలు కొట్టాడు.
68 మిలియన్ లైకులతో మెస్సీ తన ప్రపంచకప్ ట్రోఫీ ఫోటోతో గుడ్డు రికార్డును
పగలకొట్టేశాడు. గతవారం జరిగిన ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ లో ఫ్రాన్స్
జట్టుపై షూటవుటౌ లో అర్జెంటీనా విజయం సాధించింది. ఫైనల్ మ్యాచ్ లో మెస్సీ
రెండు గోల్స్ చేశాడు. అంతేకాకుండా బెస్ట్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నీకి ఇచ్చే
గోల్డెన్ బాల్ అవార్డును కూడా మెస్సీ గెలుచుకున్న విషయం తెలిసిందే.