ఉత్కంఠభరితంగా సాగిన సాకర్ ఫిఫా ఫైనల్ పోరులో షూటౌట్లో ఫ్రాన్స్ 2-4తో
అర్జెంటీనాపై ఓడిపోయిన విషయం తెలిసిందే. అయితే మ్యాచ్ ఓడినా ఆ జట్టు అందరి
మనసులు గెలుచుకుంది. అందుకు కారణం.. హ్యాట్రిక్ గోల్స్ చేసిన ఫ్రాన్స్
ఆటగాడు కైలియన్ ఎంబాపే. గోల్డెన్ బూట్ అందుకున్నప్పుడు కూడా ఈ 23 ఏళ్ల
ప్లేయర్ కప్పు చేజారిందనే విచారంతోనే ఉండిపోయాడు. మ్యాచ్ అనంతరం మొదటిసారి
అతను సోషల్‌మీడియాలో స్పందించాడు. గోల్డెన్ బూట్ పట్టుకున్న ఫొటోను
ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. ‘మేము మళ్లీ వస్తాం’ అని రాసుకొచ్చాడు.
ఇప్పటికే ఎంబాపే పోస్ట్‌ను కోటి మందికిపైగా లైక్ చేశారు. ఇక మ్యాచ్ రెండో
అర్థభాగంలో ఎంబాపే రెండు నిమిషాల వ్యవధిలోనే 2 గోల్స్ గొట్టి స్కోర్ సమం
చేశాడు. ఆ తర్వాత కూడా హ్యాట్రిక్ గోల్స్ తో జట్టుని విజయం అంచుల దాకా
తీసుకెళ్లాడు. అంతేకాదు, ఫెనాల్టీ షూట్లోనూ బంతిని గోల్‌పోస్ట్‌లోకి పంపాడు.
కానీ, మిగతా ఆటగాళ్లు విఫలం కావడంతో ఆ జట్టు ఓటమి పాలైంది. ఆ క్షణం ఈ
యువ ఆటగాడి గుండె పగిలినంత పనైంది. దిగాలుగా ఉండిపోయిన ఎంబాపేను ఫ్రాన్స్
అధ్యక్షుడు మక్రాన్ ఓదార్చాడు. ఈ టోర్నీలో ఎంబాపే అత్యధికంగా 8 గోల్స్
చేశాడు. వరల్డ్ కప్ ఫైన్లలో హ్యాట్రిక్ గోల్స్ కొట్టిన రెండో ఆటగాడిగా
ఎంబాపే చరిత్ర సృష్టించాడు. మొత్తంగా అతను ఫిఫా వరల్డ్ కప్‌లో 12
గోల్స్ సాధించాడు.