ఫిఫా ఫుట్ బాల్ వరల్డ్ కప్-2022 ఛాంపియన్ గా అర్జెంటీనా అవతరించింది. ఖతార్
వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ఫ్రాన్స్ పై గెలుపొంది టైటిల్ ను కైవసం
చేసుకుంది. నిర్ణీత సమయంలో ఇరు జట్లు కూడా 3-3 గోల్స్ తో నిలిచాయి. దాంతో
విజేతను తేల్చేందుకు పెనాల్టీ షూటౌట్ అనివార్యమైంది. ఆట మరో రెండు నిమిషాల్లో
ముగుస్తుందనగా లభించిన పెనాల్టీని గోల్ గా మలచిన ఎంబాపే స్కోర్ ను మరోసారి సమం
చేశాడు. ఇక ఆఖర్లో ఫ్రాన్స్ కు మరో గోల్ చేసే అవకాశం వచ్చినా అర్జెంటీనా గోల్
కీపర్ మార్టినేజ్ దానిని అడ్డుకుని మ్యాచ్ ను పెనాల్టీ షూటౌట్ కు
తీసుకెళ్లాడు. పెనాల్టీ షుటౌట్ లోనూ మరోసారి అడ్డుగోడగా నిలిచి అర్జెంటీనాను
గోల్ కీపర్ మార్టినేజ్ గెలిపించాడు. ఇక్కడ అర్జెంటీనా నాలుగింటికి నాలుగు
గోల్స్ వేయగా.. ఫ్రాన్స్ మాత్రం నాలుగింటిలో రెండే వేసింది. అర్జెంటీనా 4
పాయింట్లు సాధించడంతో ప్రపంచ విజేతగా నిలిచింది. 36ఏళ్ల తర్వాత ఫిఫా వరల్డ్
కప్ టైటిల్ ను అర్జెంటీనా కైవసం చేసుకుంది. అర్జెంటీనా జట్టు.. ప్రపంచ విజేతగా
నిలవడంతో ఫుట్ బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ కల నెరవేరినట్లు అయ్యింది. ఫైనల్
మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. చివరి నిమిషం వరకు ట్విస్ట్ లతో సాగిన ఈ
మ్యాచ్ లో చివరి పంచ్ అర్జెంటీనాదే అయ్యింది. 16 ఏళ్లుగా అందని ద్రాక్షలా ఉన్న
ప్రపంచకప్ ను మెస్సీ అందుకుని మురిశాడు. తన కెరీర్ లో లోటుగా ఉన్న ట్రోఫీని
ఆనందంతో ముద్దాడాడు.