దక్షిణాఫ్రికాతో జనవరిలో ఓడిపోయిన తర్వాత విరాట్ కోహ్లీ రాజీనామా చేయడంతో
ఫిబ్రవరిలో రోహిత్ శర్మ టీమిండియా కెప్టెన్‌గా పూర్తి బాధ్యతలు చేపట్టాడు.
డిసెంబర్లో రోహిత్ టెస్ట్ మ్యాచ్ లకు కూడా కెప్టెన్ అయ్యాడు. రోహిత్
ఇప్పటికే ఐపిఎల్‌లో తన వైట్-బాల్ కెప్టెన్సీని ప్రదర్శించాడు. ఐదు టైటిళ్లతో
ముంబై ఇండియన్స్‌ను నడిపించాడు. ఈ క్రమంలో ఇంటర్నేషనల్ ట్రోఫీలను కూడా
భారత్‌కు రోహిత్ అందిస్తాడని ఊహించారు. మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని 2013 ఐసీసీ
ఛాంపియన్స్ ట్రోఫీ విజయానికి మార్గనిర్దేశం చేశాడు. ఎడ్జ్‌బాస్టన్‌లో
ఇంగ్లాండ్‌ను ఐదు పరుగుల తేడాతో ఓడించి విశ్వవిజేతగా భారత్‌ను నిలబెట్టాడు.
ఇదే క్రమంలో ఐసీసీ ఈవెంట్లో తొలిసారిగా టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్‌కు రోహిత్
నాయకత్వం వహించాడు. టోర్నీలో విజేతగా నిలిచిన ఇంగ్లండ్ చేతిలో పది వికెట్ల
తేడాతో ఘోరంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. ఐసీసీ టీ20 ప్రపంచకప్‌కు ముందు ఆసియా
కప్‌లో భారత్ ఓడిపోవడం అభిమానులకు తీవ్ర నిరాశను మిగిల్చింది. ఆ సిరీస్ లో ఒక
సూపర్ 4 మ్యాచ్‌లో (ఆఫ్ఘనిస్థాన్‌పై) మాత్రమే గెలిచారు. పాకిస్తాన్,
శ్రీలంకతో ఓడిపోయారు. ఈ నేపథ్యంలో రోహిత్ కెప్టెన్సీని అంచనా వేయడం చాలా
కష్టమని మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ భావిస్తున్నాడు. రోహిత్‌కి కెప్టెన్‌గా
ఎక్కువ సమయం ఇవ్వాలని కైఫ్ అభిప్రాయపడ్డాడు.