ఫిఫా వరల్డ్ కప్ లో ఫైనలిస్టులు ఖరారయ్యారు. రెండో సెమీఫైనల్ మ్యాచ్‌లో
డిఫెండింగ్ ఛాంపియన్ ఫ్రాన్స్ ఘన విజయం సాధించింది. మొరాకోతో జరిగిన మ్యాచ్‌లో
గెలిచి ఫైనల్‌కు చేరింది. ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచులో అర్జెంటీనాతో ఫ్రాన్స్
తలపడనుంది. ఇప్పటికే మొదటి సెమీఫైనల్ మ్యాచులో క్రొయేషియాపై అర్జెంటీనా గెలిచి
ఫైనల్ కు చేరింది. అలాగే ఫ్రాన్స్ జట్టు వరుసగా రెండోసారి ఫైనల్ కు చేరింది.
ప్రపంచ కప్ ట్రోఫీ కోసం అర్జెంటీనా, ఫ్రాన్స్ దేశాలు పోటీ పడుతున్నాయి. రెండు
జట్లు గతంలో వేర్వేరు సందర్భాల్లో ట్రోఫీని గెలుచుకున్నాయి. 1978, 1986
సంవత్సరాల్లో జరిగిన ప్రపంచకప్ లో ఛాంపియన్‌గా అర్జెంటీనా నిలిచింది.
అదేవిధంగా 1998, 2018 ప్రపంచకప్ లో ఛాంపియన్‌గా ఫ్రాన్స్ నెగ్గింది. ఆదివారం
ఖతార్‌లో జరిగే టాప్ మ్యాచ్‌లో రెండు జట్లూ ప్రపంచ కప్‌ను గెలవాలన్న లక్ష్యంతో
బరిలోకి దిగనున్నాయి. ఈ ప్రక్రియలో అనేక రికార్డులను బద్దలు కొట్టాలని
లక్ష్యంగా పెట్టుకున్నాయి.