భారత్తో జరుగుతున్నతొలి టెస్టులో రెండో రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ 8
వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. ఫలితంగా భారత్ కంటే ఇంకా 271 పరుగులు
వెనకబడి ఉంది. టీమిండియా తొలి ఇన్నింగ్స్ 404 పరుగుల వద్ద ముగిసిన తర్వాత తొలి
ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్ బ్యాటింగ్లో తడబడింది. ఇన్నింగ్స్ తొలి
బంతికే దెబ్బ తగిలింది. సిరాజ్ సంధించిన తొలి బంతిని ఆడడంలో కంగారు పడిన
ఓపెనర్ నజ్ముల్ హొసైన్.. పంత్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అది మొదలు
బంగ్లాదేశ్ వికెట్లు టపటపా రాలిపడ్డాయి. సిరాజ్, కుల్దీప్ యాదవ్ బంతుల వేడికి
తట్టుకోలేని బంగ్లా బ్యాటర్లు క్రీజులో కుదురుకోలేకపోయారు. వికెట్లు
సమర్పించుకుని చకచకా పెవిలియన్ చేరారు. ఇదిలా ఉండగా, ఐసీసీ వరల్డ్ టెస్ట్
ఛాంపియన్షిప్లో రెండు మ్యాచ్ల సిరీస్ లో నాలుగో స్థానంలో ఉన్న భారత్ 12
మ్యాచుల్లో ఆరింటిలో విజయం సాధించింది. బంగ్లాదేశ్ 10 మ్యాచ్ల్లో ఎనిమిది
ఓడిపోయింది. రెండు సిరీస్లను భారత్ గెలవాలి.