ఆతిథ్య బంగ్లాదేశ్ వర్సెస్ ఇండియా తొలి టెస్ట్ మొదటి రోజు ఆట ముగిసింది. టాస్
గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 90 ఓవర్లు ఆడి 6 వికెట్లు నష్టపోయి 278
పరుగులు చేసింది. బంగ్లా బౌలర్లు చెలరేగినా.. చతేశ్వర పుజారా (90), శ్రేయస్
అయ్యర్ (82 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడి భారత్‌ను నిలబెట్టారు. కాగా,
మ్యాచ్‌లో ఓపెనర్లు కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్ శుభారంభాన్ని
అందించలేకపోయారు. రాహుల్ (22), గిల్ (20) వ్యక్తిగత స్కోర్ల వద్ద ఔట్ అయ్యారు.
విరాట్ కోహ్లీ కేవలం ఒకే ఒక్క పరుగు కొట్టి ఇస్లామ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.
దీంతో 48 పరుగులకే ఇండియా కీలకమైన 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో
పడింది. అయితే రిషబ్ పంత్, చతేశ్వర పుజారా భారత ఇన్నింగ్స్‌ను నిలబెట్టే
ప్రయత్నం చేశారు. వేగంగా పరుగులు రాబట్టిన పంత్ వ్యక్తిగత స్కోరు 46 పరుగుల
వద్ద ఔటయ్యాడు. అయితే ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన శ్రేయర్ అయ్యర్‌తో జత కలిసిన
పుజారా చక్కటి భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. 5వ వికెట్‌కు 149 పరుగుల
పార్టనర్షిప్ నెలకొల్పారు. కీలక ఇన్నింగ్స్ ఆడిన పుజారా.. వ్యక్తిగత స్కోరు
90 పరుగుల వద్ద ఔటయ్యాడు. కాగా, మొదటి రోజు చివరి బంతికి అక్షర్ పటేల్ (14
పరుగులు) ఎల్బీగా ఔటయ్యాడు. తొలిరోజు ఆట ముగిసే సమయానికి 82 పరుగులతో శ్రేయస్
అయ్యర్ క్రీజులో ఉన్నాడు.