ఫిఫా ప్రపంచకప్ సెమీఫైనల్‌కు డిఫెండింగ్ చాంపియన్ ఫ్రాన్స్ దూసుకెళ్లింది.
అద్వితీయ ఆటతీరుతో ఆకట్టుకుంటున్న ఫ్రాన్స్ క్వార్టర్ ఫైనల్లో 2-1తో
ఇంగ్లండ్‌పై ఘనవిజయం సాధించింది. ఫ్రాన్స్ తరఫున అరెలిన్ చౌమెని (17వ
నిమిషంలో), ఒలీవర్ గిరాడ్ (78వ నిమిషంలో) చెరో గోల్ సాధించగా.. ఇంగ్లండ్
తరఫున కెప్టెన్ హ్యారీ కేన్ (54వ ని.లో) ఏకైక గోల్ చేశాడు. తొలి అర్ధభాగంలో
చౌమెని గోల్‌తో ఆధిక్యంలోకి వెళ్లిన ఫ్రాన్స్ అదే జోరు కొనసాగిస్తూ..
మ్యాచ్‌పై పట్టు సాధించే ప్రయత్నం చేసింది. ద్వితీయార్ధంలో వచ్చిన పెనాల్టీ
అవకాశాన్ని ఇంగ్లండ్ సారథి కేన్ సద్వినియోగం చేసుకున్నాడు. ఫలితంగా స్కోరు
సమం కాగా.. అక్కడి నుంచి ఇరు జట్లు ప్రత్యర్థి గోల్ పోస్ట్‌పై దాడుల తీవ్రతను
పెంచాయి. ఈ క్రమంలో ఫ్రాన్స్ మరో గోల్ నమోదు చేసుకోగా.. 84వ నిమిషంలో వచ్చిన
పెనాల్టీ అవకాశాన్ని కేన్ గోల్‌గా మలచలేకపోయాడు.