సొంతగడ్డపై ఆస్ట్రేలియా మహిళల జట్టుతో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌ను భారత్
భారీ ఓటమితో ఆరంభించింది. శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రపంచ ఛాంపియన్
ఆసీస్ 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఆస్ట్రేలియా మహిళల జట్టు
నిర్ణయాత్మక తొమ్మిది వికెట్ల విజయానికి 57 బంతుల్లో 89 పరుగులు చేసి, ఓపెనర్
బెత్ మూనీ త్వరగా భారతదేశం విధించిన 173 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది.
తహ్లియా మెక్‌గ్రాత్ 29 బంతుల్లో అజేయంగా 40 పరుగులు చేసింది. ఇందులో నాలుగు
బౌండరీలు, రెండు సిక్సర్లు ఉన్నాయి. దీంతో ఐదు మ్యాచ్‌ల రన్లో మొదటి
మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో ముందుగా
బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 172 పరుగులు చేసింది.
భారత టాపార్డర్ బ్యాటర్లు ఫెఫాలీ వర్మ(10 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో
21), స్మృతి మంధానా(22 బంతుల్లో 5 ఫోర్లతో 28), జెమీమా రోడ్రిగ్స్(0)
విఫలమైనా.. ఫినిషింగ్ బ్యాటర్ల దీప్తి శర్మ(15 బంతుల్లో 8 ఫోర్లతో 36), రిచా
ఘోష్(20 బంతుల్లో 5 ఫోర్లు 2 సిక్స్‌లతో 36) ధనాధన్ బ్యాటింగ్‌తో చెలరేగారు.
దీంతో.. భారత్ ఆసీస్ ముందు పోరాడే లక్ష్యాన్ని ఉంచింది. ఆసీస్ బౌలర్లలో
ఎల్లిస్ పెర్రీ రెండు వికెట్లు తీయగా.. గార్డెనర్, సదర్లాండ్, కిమ్ గెరోత్
తలో వికెట్ తీసారు.