తనకు క్రికెట్ కన్నా కుటుంబమే ముఖ్యమని ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్
వార్నర్ అన్నాడు. ‘‘నాకు క్రికెట్ కన్నా నా కుటుంబమే చాలా ముఖ్యం’’ అని
ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ అన్నాడు. ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు
కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించకుండా తనపై ఉన్న జీవితకాల నిషేధాన్ని
ఎత్తివేసేందుకు సమీక్ష జరపాలని ఇటీవల ఆయన అప్పీలు చేసుకున్నాడు. అయితే, ఆ
అప్పీలును ఉపసంహరించుకుంటున్నట్లు రివ్యూ ప్యానెల్ కి ఆయన ఇవాళ లేఖ రాసి
అందరినీ ఆశ్చర్యపర్చాడు. ఈ మేరకు రివ్యూ ప్యానెల్ కు రాసిన లేఖను డేవిడ్
వార్నర్ ఇన్స్టాగ్రామ్ లోనూ పోస్ట్ చేశాడు. 2018 మార్చిలో తన సారథ్యంపై
ఆస్ట్రేలియా క్రికెట్ శాశ్వత నిషేధం విధించిన విషయాన్ని ఆ తర్వాత
చోటుచేసుకున్న పరిణామాలను వార్నర్ గుర్తు చేసుకున్నాడు. ఆ సమయంలో
దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్ లో జరిగిన మూడో టెస్టు మ్యాచులో ఆస్ట్రేలియా
జట్టు బాల్ ట్యాంపరింగ్ కు పాల్పడిందని ఆరోపణలు రావడంతో తనపై అనేక విమర్శలు
వచ్చాయని చెప్పాడు. ఆ సమయంలో తన భార్య క్యాండిస్, తన ముగ్గురు పిల్లలు ఇవి
మయీ, ఇండి రయీ, ఇస్లా రోజ్ తనకు పూర్తిగా మద్దతుగా నిలిచారని అన్నాడు. వారే తన
ప్రపంచమని చెప్పాడు.