భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ ఎడమ చేతి బొటన వేలికి తీవ్ర గాయమైంది. రెండో వన్డే
రెండో ఓవర్లో సిరాజ్ బౌలింగ్‌లో అనాముల్ ఇచ్చిన క్యాచ్ ను స్లిప్స్‌లో
అందుకొనే క్రమంలో రోహిత్ చేతికి బంతి బలంగా తాకింది. క్యాచ్ నేలపాలుకాగా..
బొటన వేలు, చూపుడు వేలి మధ్య చర్మం తెగి రక్తస్రావమైంది. తక్షణం ఆసుపత్రికి
తరలించగా.. వైద్యులు కుట్లు వేసి కట్టుకట్టారు. కానీ టీమ్ విపత్కర
పరిస్థితుల్లో ఉండడంతో.. రోహిత్ చివర్లో బరిలోకి దిగాడు. అయితే వేలు
డిస్లొకేట్ కావడంతో.. నిపుణులైన వైద్యులను సంప్రదించేందుకు రోహిత్.. భారతకు
తిరుగు పయనం కానున్నాడని కోచ్ ద్రావిడ్ చెప్పాడు. దీంతో మూడో వన్డేకు దూరమైన
అతడు.. బంగ్లా టూర్‌కే దూరమయ్యే చాన్సుం ది. రోహిత్ తోపాటు గాయపడిన దీపక్
చాహర్, కుల్దీప్ సేన కూడా మూడో వన్డేకు అందుబాటులో ఉండకపోవచ్చని
ద్రావిడ్ చెప్పాడు.