పాకిస్థాన్ తో జరిగిన తొలి టెస్ట్‌లో 74 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ జయకేతనం
ఎగురవేసింది. మందగిస్తున్నవెలుతురు, ఇంకొన్ని నిమిషాలపాటు ఆట సాగితే పాక్
డ్రాతో గట్టెక్కే అవకాశాలుండగా.. చివరి వికెట్‌గా నసీమ్ షా (6)ను అవుట్
చేసిన లీచ్ ఇంగ్లండ్‌కు చిరస్మరణీయ విజయాన్నందించాడు. 343 పరుగుల ఛేదనలో ఆటకు
ఐదో, ఆఖరి రోజైన సోమవారం.. పాక్ గెలుపునకు ఇంకా 263 పరుగులు అవసరం. ఈ
నేపథ్యంలో ఓవర్‌నైట్ స్కోరు 80/2తో బరిలోకి దిగిన పాక్ రెండో ఇన్నింగ్స్‌లో
268 పరుగులకు ఆలౌటైంది. సౌద్ షకీల్ (76), ఇమాముల్ హక్ (48), రిజ్వాన్ (46)
ఓటమిని తప్పించేందుకు శాయశక్తులా ప్రయత్నించారు. అండర్సన్, ఓలీ రాబిన్సన్ చెరో
4 వికెట్లు పడగొట్టారు. టీ సమయానికి 257/5 ఉన్న పాక్.. చివరి సెకండులో 11
పరుగులకే మిగిలిన 5 వికెట్లు చేజార్చుకొని ఓటమి చవిచూసింది. ఇంగ్లండ్ తొలి
ఇన్నింగ్స్‌లో 657 పరుగులు చేయగా.. రెండో ఇన్నింగ్స్‌లో 264/7 స్కోరు వద్ద
డిక్లేర్ చేసింది. పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో 579 పరుగులకు ఆలౌటైంది.