షూటౌట్లో గోల్‌కీపర్ డొమినిక్ లివాకోవిచ్ హ్యాట్రిక్ సేవ్ చేయడంతో క్రొయేషియా
వరుసగా రెండో ప్రపంచ కప్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. జోస్కో
గ్వార్డియోల్ క్రొయేషియన్ల కోసం సెంటర్-బ్యాక్‌లో మరొక కమాండింగ్ ప్రదర్శన
ప్రదర్శించాడు. సోమవారం జరిగిన ప్రిక్వార్ట్స్ పోరులో జపాన్ పై క్రొయేషియా..
దక్షిణ కొరియాపై బ్రెజిల్ విజయాలు సాధించాయి. దాంతో క్రొయేషియా, బ్రెజిల్
క్వార్టర్ ఫైనల్ కు చేరుకున్నాయి. సోమవారం జరిగిన తొలి ప్రిక్వార్టర్ ఫైనల్లో
క్రొయేషియా పెనాల్టీ షూటౌట్ లో జపాన్ పై 3-1 తేడాతో నెగ్గింది. ఈ మ్యాచ్ లో
ఇరు జట్లు కూడా నిర్ణీత సమయంలో 1-1తో సమంగా నిలిచాయి. జాపాన్ తరఫున మెడా 43వ
నిమిషంలో గోల్ సాధించి ఆధిక్యాన్ని ఇచ్చాడు. అయితే రెండో అర్ధ భాగంలో 55వ
నిమిషంలో పెరిసిచ్ గోల్ చేసి స్కోర్లను సమం చేశాడు. ఆ తర్వాత ఇరు జట్లు కూడా
గోల్ కోసం చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి. 90 నిమిషాల ఆట 1-1 గోల్స్ తో
ముగిసింది. ఆ తర్వాత 30 నిమిషాల పాటు ఎక్స్ ట్రా టైమ్ ఆట సాగింది. ఇందులోనూ
ఇరు జట్లు గోల్ సాధించడంలో విఫలం అయ్యాయి. దాంతో మ్యాచ్ పెనాల్టీ షూటౌట్ కు
దారి తీసింది. ఈ ప్రపంచకప్ లో ఇదే తొలి పెనాల్టీ షూటౌట్ కావడం విశేషం. ఇందులో
జపాన్ తన తొలి రెండు షాట్లను గోల్స్ చేయడంలో విఫలం అయింది. అదే సమంయలో
క్రొయేషియా తొలి రెండు షాట్లను గోల్స్ చేసింది. మూడో షాట్ ను జపాన్ గోల్
చేయగా.. క్రొయేషియా మిస్ చేసింది. ఇక నాలుగో షాట్ ను జపాన్ కెప్టెన్ మిస్
చేశాడు. క్రొయేషియా నాలుగో షాట్ ను గోల్ వేసి విజేతగా నిలిచింది.