బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్ కు టీమ్ఇండియా సిద్ధం..
బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్ కు టీమ్ఇండియా సిద్ధమైంది. ఆటగాళ్లు ఉదయం,
సాయంత్రం నెట్స్‌లో కఠోరంగా శ్రమిస్తున్నారు. న్యూజిలాండ్ సిరీస్ లో
విశ్రాంతి తీసుకున్న కేఎల్ రాహుల్ బంగ్లా పర్యటనకు ఎంపికయ్యాడు. అయితే,
ఇప్పుడు భిన్నమైన పాత్రలోకి మారుతున్నాడు. టీ20ల్లో మాదిరిగా ఓపెనింగ్ చేయడు.
రోహిత్ శర్మకు జోడీగా శిఖర్ ధావన్ ఉన్నాడు. దీంతో మిడిలార్డర్లో
బ్యాటింగ్‌కు రానున్నాడు. మిడిలార్డర్లోనూ కేఎల్ రాహుల్‌కు పోటీ ఎక్కువగానే
ఉంది. ఓపెనర్లుగా రోహిత్, శిఖర్ వస్తారు. వన్‌డౌన్ ఎప్పటికీ కింగ్
కోహ్లీదే. 4, 5 స్థానాల్లో సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, రిషభ్
పంత్ పోటీకి ఉన్నారు. అద్భుతమైన ఫామ్ లో నిలకడగా ఉన్న యువ క్రికెటర్ శుభ్‌మాన్
గిల్ ఈ సిరీస్‌లో విశ్రాంతి తీసుకున్నాడు. ఈ సిరీస్ పై కోచ్ రాహుల్
ద్రవిడ్ ప్రత్యేకంగా దృష్టి సారించాడు. వేర్వేరు స్థానాల్లో ఆడుతున్నప్పుడు
బ్యాటింగ్ దృక్పథం ఎలా ఉండాలో కోచ్ టీమిండియాకు బోధించాడు.