భారత జట్టులో ఫాస్ట్ బౌలర్ ఉమ్రాన్ కొనసాగితే తనకే ప్రయోజనకరమని పేసర్
అర్షదీప్ సింగ్ వ్యాఖ్యానించాడు. ఉమ్రాన్ మాలిక్‌తో కలిసి బౌలింగ్ చేయడం
బావుంటుందని అన్నాడు. ఉమ్రాన్ సరదాగా ఉంటాడు కాబట్టి డ్రెసింగ్ రూమ్ వాతావరణం
కూడా ఆహ్లాదకరంగా ఉంటుందని అభిప్రాయపడ్డాడు. క్రైస్ట్‌చర్చ్ వేదికగా బుధవారం
న్యూజిలాండ్, ఇండియా మధ్య మూడవ వన్డేకు ముందు అర్షదీప్ ఈ విధంగా స్పందించాడు.
‘‘ ఉమ్రాన్ గంటకు 155 కిలోమీటర్ల భారీ వేగంతో బంతిని వేస్తాడు. నేను గంటకు
135 కిలోమీటర్ల వేగంతో సంధిస్తాను. ఈ స్పీడ్ల మధ్య బ్యాట్స్‌మెన్ క్రీజులో
కుదురుకునేందుకు బాగా ఇబ్బందులు పడతారు. వేగాల మధ్య మార్పులతో బ్యాట్స్‌మెన్
పొరపాటు చేస్తుంటారు. అందుకే ఉమ్రాన్ మాలిక్ జట్టులో ఉంటే నాకు ప్రయోజనకరం.
కలిసి బౌలింగ్ చేయడాన్ని ఇద్దరం ఆస్వాదిస్తాం. సుదీర్ఘకాలం ఈ భాగస్వామ్యాన్ని
కొనసాగించగలమని అనుకుంటున్నాను’’ అని అర్షదీప్ సింగ్ వ్యాఖ్యానించాడు.