ఖతార్ లో జరుగుతున్న ఫిఫా ప్రపంచకప్ గ్రూప్ ‘ఈ’లో తలపడుతున్న నాలుగుసార్లు
చాంపియన్ జర్మనీకి తొలి పోరులో జపాన్ షాకిచ్చింది. ఆదివారం అర్ధరాత్రి
జరిగిన రెండో మ్యాచ్‌లో కూడా స్పెయిన్ చేతిలో ఓటమి అంచులదాకా వెళ్లి, టోర్నీ
నుంచి నిష్క్రమించే పరిస్థితి వచ్చింది.. కానీ చివరి నిమిషాల్లో
సబ్‌స్టిట్యూట్ నిక్లాస్ ఫుల్క్రగ్ చేసిన గోల్‌తో 1-1తో జర్మనీ మ్యాచ్‌ను
డ్రా చేసుకోగలిగింది. మొరాట (62వ ని.) చేసిన గోల్‌తో స్పెయిన్ ఆధిక్యం
ప్రదర్శించగా.. 83వ నిమిషంలో నిక్లాస్ గోల్ కొట్టడంతో జర్మనీ ఊపిరి
పీల్చుకుంది. ఒక మ్యాచ్ ఓడి, మరో మ్యాచ్ డ్రా చేసుకున్న జర్మనీ కేవలం ఒక
పాయింట్‌తో గ్రూపులో అట్టడుగు స్థానంలో ఉండడం గమనార్హం. ఇక గురువారం
కోస్టారికాతో జరిగే గ్రూప్ చివరి మ్యాచ్‌లో జర్మనీ తప్పనిసరిగా నెగ్గాలి.
అంతేకాదు గ్రూపులోని మరో మ్యాచ్ ఫలితమూ జట్టుకు అనుకూలించాల్సి ఉంటుంది.
జపాన్‌పై స్పెయిన్, కోస్టారికాపై జర్మనీ విజయం సాధిస్తే ఆ రెండు జట్లు
రౌండ్-16కు చేరతాయి.