టీ 20 ప్రపంచ కప్ గెలిచి జోరుమీదున్న ఇంగ్లండ్ జట్టు పాకిస్థాన్‌తో టెస్ట్
సిరీస్‌లో తలపడనుంది. దీనికోసం ఇంగ్లాండ్ ఆటగాళ్లు ఆదివారం తెల్లవారుజామున
పాక్‌లోని ఇస్లామాబాద్ లో అడుగుపెట్టారు. గత 17 సంవత్సరాల్లో ఇంగ్లండ్
క్రికెటర్లు టెస్ట్ మ్యాచ్‌ల కోసం పాక్‌కు రావడం ఇదే మొదటిసారి కావడం
గమనార్హం. ఇంగ్లండ్ ఆటగాళ్లు చివరిసారిగా 2005లో పాక్‌లో పర్యటించారు. ఇక
అప్పటినుంచి భద్రతా కారణాల దృష్ట్యా ఇంగ్లాండ్ జట్టు పాక్ పర్యటనకు దూరంగా
ఉంటూ వస్తోంది. రెండు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు ఇంగ్లండ్,
ప్రత్యామ్నాయ వేదికల్లో జరుగుతూనే ఉన్నాయి. ఈ తరుణంలో గురువారం నుంచి ఇంగ్లండ్
టూర్‌లోని తొలి టెస్టు ఇస్లామాబాద్ పక్కనే ఉన్న రావల్పిండిలో జరగనుంది.
స్టోక్స్ ఇంగ్లాండ్ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. రెండో టెస్టు డిసెంబర్ 9
నుంచి13 వరకు ముల్తాన్‌లో జరగనుండగా, చివరి పరీక్ష డిసెంబర్ 17నుంచి 21 వరకు
కరాచీలో జరగనుంది. అనంతరం ఇంగ్లండ్ తన పర్యటనను ముగించనుంది.