న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి వన్డేలో ఓటమిపై భారత కెప్టెన్ శిఖర్ ధావన్
స్పందించాడు. బౌలింగ్ వైఫల్యాల వల్లే ఈ మ్యాచ్ లో ఓడిపోయామని చెప్పాడు.
మ్యాచ్ అనంతరం ధావన్ మీడియాతో మాట్లాడాడు. ‘బ్యాటింగ్ పరంగా మేం బాగా ఆడాం.
కివీస్ ముందు ఉంచిన లక్ష్యం కూడా మంచిదే. రెండో ఇన్నింగ్స్ లో తొలి 15
ఓవర్లు బంతి బౌలర్లకు అనుకూలించింది. మిగిలిన గ్రౌండ్స్ కంటే ఇది (ఆక్లాండ్
ఈడెన్ పార్క్) కాస్త డిఫరెంట్ గా ఉంది. ఈ మ్యాచ్ లో మేం చాలా వరకు షాట్
బంతులు విసిరాం.. అదే మా కొంపముంచింది. ఈ మ్యాచ్ లో టామ్ లాథమ్ మా బౌలర్లు
విసిరిన షాట్ బంతులను టార్గెట్ గా చేసుకుని విజృంభించాడు. 40వ ఓవర్లో అతడు
వరుసగా నాలుగు ఫోర్లు బాదాడు. అదే మా నుంచి మ్యాచ్ ను దూరం చేసింది. మ్యాచ్ లో
మా వ్యూహాలు సరిగా అమలు కాలేదు. బ్యాటింగ్ పరంగా మాకు పెద్దగా లోపాలేమీ
లేవు..’అని వ్యాఖ్యానించాడు. ఇదిలా ఉండగా, మ్యాచ్ లో కీవిస్ ఆటగాడు లాథమ్ 104
బంతుల్లో అజేయంగా 145 పరుగులు చేశాడు. అలాగే కెప్టెన్ కేన్ విలియమ్సన్ 98
బంతుల్లో అజేయంగా 94 పరుగులు చేయడంతో న్యూజిలాండ్ 307 పరుగుల తేడాతో భారత్‌ను
ఓడించింది. సిరీస్ లో 1-0 ఆధిక్యాన్ని సంపాదించింది.