ఆక్లాండ్ లోని ఈడెన్ పార్క్ లో న్యూజీలాండ్ తో ఓటమిపై భారత బ్యాట్స్మన్
శ్రేయాస్ అయ్యర్ స్పందించాడు. ఓటమిపై టీమిండియా ఆత్మపరిశీలన చేసుకోవాలన్నాడు.
మ్యాచ్ అనంతరం శ్రేయాస్ మీడియాతో మాట్లాడాడు. ‘‘నేటి మ్యాచులో కొన్ని అంశాలు
మాకు అనుకూలంగా లేవు. టీమిండియా ఆత్మపరిశీలన చేసుకుని, తదుపరి రెండు వన్డేల్లో
మరింత ప్రభావవంతంగా ఆడాలి. మేము ఆడిన పరిస్థితుల్లో 307 పరుగులు చేయడం
ప్రశంసనీయమే. కొన్ని అంశాలు మాకు అనుకూలంగా లేనప్పటికీ వాటి నుంచి
నేర్చుకోవాల్సి ఉంది. ఆత్మ పరిశీలన చేసుకుని, కొత్త ఐడియాలతో ముందుకు
వెళ్ళాలి’’ అని శ్రేయాస్ అయ్యర్ అన్నాడు. కాగా, ఓటమి పాలైన మ్యాచులో
శ్రేయాస్ 76 బంతుల్లో 80 పరుగులు, శిఖర్ ధావన్ 77 బంతుల్లో 72 పరుగులు తీశారు.