మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్ తో జరిగిన తొలి వన్డేలో న్యూజిలాండ్ ఏడు
వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈడెన్ పార్క్ మైదానంలో జరిగిన మొదటి మ్యాచ్
లో టామ్ లాథమ్ సంచలన ఇన్నింగ్స్‌తో భారత్ నిర్దేశించిన 307 పరుగుల విజయ
లక్ష్యాన్నికీవిస్ అలవోకగా ఛేదించింది. కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఈ
మ్యాచ్‌తో మళ్లీ ఊపులోకి వచ్చాడు. 307 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన
న్యూజిలాండ్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. 35 పరుగుల వద్ద ఫిన్ అలెన్
(22)ను శార్దూల్ ఠాకూర్ వెనక్కి పంపాడు. 68 పరుగుల వద్ద డెవోన్ కాన్వే (24),
88 పరుగుల వద్ద డరిల్ మిచెల్ (11) అవుటయ్యారు. దీంతో మ్యాచ్ భారత్ వైపు
మొగ్గుతున్నట్టు కనిపించింది. అయితే విలియమ్సన్ సంయమనంతో ఆడగా, లాథమ్ మాత్రం
చెలరేగిపోయాడు. ఫోర్లు సిక్సర్లతో స్టేడియంను హోరెత్తించాడు. అతడి దెబ్బకు
భారత బౌలింగ్, ఫీల్డింగ్ కకావికలమైంది. వికెట్ల కోసం టీమిండియా బౌలర్లు
చెమటోడ్చినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. మరోవైపు, 76 బంతుల్లోనే సెంచరీ
పూర్తి చేసుకున్న లాథమ్ ఆ తర్వాత కూడా అదే ఊపు కొనసాగించాడు. విలియమ్సన్
అతడికి అండగా నిలుస్తూ అడపా దడపా బౌండరీలు బాదుతూ జట్టును విజయం దిశగా
నడిపించాడు. చివరికి 17 బంతులు మిగిలి ఉండగానే విజయం కివీస్ సొంతమైంది.
విలియమ్సన్ 98 బంతుల్లో 7 ఫోర్లు, సిక్సర్‌తో అజేయంగా 94 పరుగులు చేసి
సెంచరీకి ఆరు పరుగుల దూరంలో నిలిచిపోయాడు. టామ్ లాథమ్ 104 బంతుల్లో అజేయంగా
145 పరుగులు చేశాడు. ఇందులో 19 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో ఏడు
వికెట్ల నష్టానికి 306 పరుగుల భారీ స్కోరు సాధించింది. కెప్టెన్ ధవన్-శుభమన్
గిల్ జంట తొలి వికెట్‌కు 124 పరుగులు జోడించి ఘనమైన ఆరంభాన్నిఇచ్చింది. అర్ధ
సెంచరీ (50) చేసి గిల్ అవుటయ్యాడు. ఆ వెంటనే అదే స్కోరు వద్ద 72 పరుగులు చేసి
జోరుమీదున్నట్టు కనిపించిన ధవన్ కూడా పెవిలియన్ చేరాడు. పంత్ మరోమారు
నిరాశపరిచాడు. ఫార్మాట్ మారినా అతడి ఆటతీరులో మాత్రం మార్పు కనిపించలేదు. 15
పరుగులు మాత్రమే చేసి ఉసూరు మనిపించాడు. సూర్యకుమార్ 4 పరుగులు మాత్రమే చేసి
అవుటయ్యాడు. అయితే క్రీజులో పాతుకుపోయిన శ్రేయాస్ అయ్యర్ మాత్రం కివీస్
బౌలర్లపై దాడి చేశాడు. 76 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 80 పరుగులు చేసి
అవుటయ్యాడు. సంజు శాంసన్ 36 పరుగులు చేయగా, వాషింగ్టన్ సుందర్ మెరుపు
ఇన్నింగ్స్‌తో జట్టు స్కోరు 300 పరుగులు దాటించాడు. 16 బంతుల్లో మూడు ఫోర్లు,
మూడు సిక్సర్లతో 37 పరుగులు చేశాడు. కివీస్ బౌలర్లలో సౌథీ, ఫెర్గూసన్ చెరో
మూడు వికెట్లు తీసుకున్నారు. అజేయ సెంచరీతో జట్టుకు అద్భుత విజయాన్ని అందించిన
లాథమ్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.