మాంచెస్టర్ యునైటెడ్‌తో క్రిస్టియానో రొనాల్డో బంధానికి తెరపడింది. పరస్పర
అంగీకారంతోనే అతడిని బయటకు పంపిస్తున్నామని క్లబ్ యాజమాన్యం తెలిపింది.
ఇందుకు అవసరమైన చర్యలు తీసుకున్నామని వెల్లడించింది. క్లబ్ మేనేజర్ ఎరిక్
టెన్ హాగ్‌ను ఓ మీడియా సమావేశంలో విమర్శించడంతో మ్యాన్ యునైటెడ్, రొనాల్డో
మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. మెల్లగా మొదలైన ఈ వ్యవహారం చినికి చినికి గాలివానగా
మారింది. క్రిస్టియానో రొనాల్డో ప్రవర్తన తమకు ఇబ్బంది కలిగిస్తోందని
మాంచెస్టర్ యునైటెడ్ భావిస్తోంది. దిగ్గజ ఆటగాడే అయినప్పటికీ మేనేజర్
ఎరిక్ టెన్ హాగ్కు అండగా నిలవాలని నిర్ణయించుకుంది. టెన్ హాగ్ ఆదేశాలను
తాను పట్టించుకోలేదని చెప్పడాన్ని అది జీర్ణించుకోవడం లేదు. అందుకే అతడితో
బంధం తెంచుకోవాలని అనుకుంది. ఫలితంగా రొనాల్డో నాలుగేళ్లలోనే నాలుగో క్లబ్‌ను
వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.