ఆసీస్ స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఆ దేశ క్రికెట్ బోర్డుపై ఫైరయ్యాడు.
2018లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడిన
స్మిత్, వార్నర్‌పై ఏడాదిపాటు ఆ దేశ క్రికెట్ బోర్డు నిషేధం విధించింది.
అంతేకాకుండా, వార్నర్ తన జీవిత కాలంలో కెప్టెన్ కాకుండా నిషేధించింది. ఈ
క్రమంలో సోమవారం ఆసీస్ క్రికెట్ బోర్డు కీలక ప్రకటన చేసింది. కోడ్ ఆఫ్
కండక్ట్‌కు సవరణలు చేశామని, ఇంతకుముందులా కాకుండా ఇప్పుడు నిషేధంపై అప్పీలు
చేసుకోవచ్చని ప్రకటించింది. ఆసీస్ క్రికెట్ బోర్డు ఒకసారి నిషేధం విధిస్తే
దానిని అప్పీలు చేసుకునే అవకాశం ఇప్పటి వరకు ఉండేది కాదు. అయితే, ఇప్పుడు
సవరణలు చేయడంతో అప్పీలు చేసుకునే వెసులుబాటు లభించింది. బోర్డు తాజా ప్రకటనపై
డేవిడ్ వార్నర్ తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. తానేమీ నేరస్తుడిని కాదన్నాడు.
తనపై నిషేధం ఉందన్న సంగతి తనకు తెలుసని అన్నాడు. అయితే, ఏదో ఒక దశలో అప్పీలు
చేసుకునే హక్కు ఉండాలన్నాడు. జీవితాంతం నిషేధమంటే కొంచెం కఠినమైన విషయమేనని
పేర్కొన్నాడు. ఈ ప్రక్రియ చాలా సుదీర్ఘంగా కొనసాగిందన్నాడు. ఈ సమయంలో తాను, తన
కుటుంబం, ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరు ఎంతో బాధను అనుభవించారని
వార్నర్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఒక వ్యక్తిపై జీవితకాలంపాటు ఇలాంటి నిషేధం
విధించడం చాలా కఠినమైన నిర్ణయమని పేర్కొన్నాడు.