ఫిఫా వరల్డ్‌కప్ 2022 ఆరంభానికి ముందే డిఫెండింగ్ చాంపియన్ ఫ్రాన్స్‌కు
షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే జట్టు స్టార్ ఆటగాళ్లు పాల్
పోగ్బా, కాంటే, కుంకూలు గాయాలతో సాకర్ సమరానికి దూరమయ్యారు. తాజాగా ఈ ఏడాది
ప్రతిష్టాత్మక బాలన్ డీ ఓర్ అవార్డు విజేత కరీమ్ బెంజెమా గాయంతో ఫిఫా
వరల్డ్‌కప్ నుంచి వైదొలిగాడు. 34 ఏళ్ల కరీమ్ బెంజెమా ఎడమ తొడ గాయంతో
బాధపడుతున్నట్లు జట్టు యాజమాన్యం ప్రకటించించి. అసలు సమరానికి ముందు శనివారం
జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో గంట పాటు మైదానంలో ఉన్న బెంజెమా చాలా ఇబ్బందిగా
కదలడంతో వైద్యులు అతన్ని పరీక్షించారు. కనీసం మూడు వారాల విశ్రాంతి అవసరమని
పేర్కొనడంతో బెంజెమా టోర్నీ మొత్తానికే దూరమయ్యాడు.