సూర్యకుమార్ యాదవ వీర విహార బ్యాటింగ్ తో భారత్ నెగ్గింది. బ్యాటింగ్,
బౌలింగ్‌లోనూ అదరగొట్టిన టీమిండియా ఆకట్టుకుంది. స్పిన్నర్లు యజువేంద్ర
చాహల్, వాషింగ్టన్ సుందర్, దీపక్ హుడాలకుతోడు పేసర్లు మహ్మద్ సిరాజ్,
భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ సింగ్‌లు కూడా రాణించడంతో ఆదివారం మౌంట్ మాంగనుయ్
వేదికగా జరిగిన రెండవ టీ20లో టీమిండియా ఘన విజయం నమోదు చేసింది. భారత్
నిర్ధేశించిన 192 పరుగుల లక్ష్యాన్ని చేధించడంలో కివీస్ బ్యాట్స్‌మెన్
చతికిలపడ్డారు. 18.5 ఓవర్లలో 126 పరుగుల వద్ద ఆలౌట్ అయ్యారు. దీంతో భారత్ 65
పరుగుల తేడాతో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. భారత బౌలర్లలో దీపక్ హుడా
అత్యధికంగా 4 వికెట్లు తీశాడు. ఆ తర్వాత చాహల్, మహ్మద్ సిరాజ్ చెరో 2
వికెట్లు, భువనేశ్వర్ కుమార్, వాషింగ్టన్ సుందర్ తలో వికెట్ తీశారు. కివీస్
బ్యాట్స్మెన్లలో కెప్టెన్ కేన్ విలియమ్సన్ అత్యధికంగా 61 పరుగులు చేశాడు. ఆ
తర్వాత డెవోన్ కాన్వే 25 రెండవ టాప్ స్కోరర్‌గా ఉన్నాడు. కాగా భారత విజయంలో
కీలకపాత్ర పోషించిన సెంచరీ వీరుడు సూర్యకుమార్ యాదవ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది
మ్యాచ్’ అవార్డ్ దక్కింది. సూర్యకుమార్ యాదవ్ తన విధ్వంసకరమైన బ్యాటింగ్ ను
మరోసారి చూపించాడు. కేవలం 49 బంతులలోనే సెంచరీని బాది, తన కెరీర్ లో రెండో
శతకాన్ని నమోదు చేసుకున్నాడు. భారత ఇన్నింగ్స్ ముగిసే సమయానికి 51 బంతులకు
అతను 111 పరుగులను చేసి అజేయంగా నిలిచాడు. 32 బంతుల్లో అర్ధ సెంచరీని సాధించిన
సూర్యకుమార్ యాదవ్ కేవలం 17 బంతులలోనే తర్వాతి అర్థ సెంచరీని
పూర్తి చేసుకున్నాడు.