ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్ 2022లో భారత్ సెమీస్ నుంచి నిష్క్రమించిన విషయం
తెలిసిందే. మెగా టోర్నీలో సెమీస్ నుంచి ఇంటిదారి పట్టడంతో టీమిండియాపై
విమర్శల వర్షం కురిసింది. దీంతో బీసీసీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. చేతన్ శర్మ
నేతృత్వంలోని నలుగురు సభ్యుల సీనియర్ జాతీయ సెలక్షన్ కమిటీని బీసీసీఐ
శుక్రవారం తొలగించింది. చేతన్ (నార్త్ జోన్), హర్విందర్ సింగ్ (సెంట్రల్
జోన్), సునీల్ జోషి (సౌత్ జోన్), దేబాసిష్ మొహంతి (ఈస్ట్ జోన్) సీనియర్ జాతీయ
సెలెక్టర్లుగా ఉన్న విషయం తెలిసిందే. ఇందులో కొందరిని 2020లో, మరికొందరిని
2021లో బీసీసీఐ నియమించింది. సీనియర్ జాతీయ సెలెక్టర్ గరిష్టంగా నాలుగు
సంవత్సరాల పదవీకాలాన్ని పొందుతారు. బీసీసీఐ తాజా నిర్ణయంతో మొత్తం 5
సెలెక్టర్ల పోస్ట్ కోసం ఖాళీలు ఉన్నాయి. ఇందుకోసం బీసీసీఐ దరఖాస్తులను కూడా
పిలిచింది. దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు 7 టెస్ట్ మ్యాచ లు, లేదా 30 ఫస్ట్
క్లాస్ మ్యాచ్ లు, లేదా 10 వన్డే, అలాగే 20 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడి
ఉండాలి. ఇక దరఖాస్తు దారులందరూ కనీసం ఐదేళ్ల క్రితం రిటైర్ అయి ఉండాలి. ఈ
పోస్ట్‌లకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ నవంబర్ 28గా బీసీసీఐ పేర్కొంది.