మహిళల అండర్-19 టీ20 క్రికెట్ టోర్నీలో భారత్-ఏ, భారత్-బి జట్లు
ఫైనల్స్‌కు చేరాయి. లీగ్ మ్యాచ్‌లలో 12 పాయింట్లతో భారత్-బి, 8 పాయింట్లతో
భారత్-ఏ ఫైనల్ బెర్తులు ఖరారు చేసుకోగా…నాలుగు పాయింట్లు సాధించిన
శ్రీలంక, ఒక్క పాయింట్ కూడా దక్కించుకోలేకపోయిన వెస్టిండీస్ ఇంటిముఖం
పట్టాయి. గురువారం జరిగిన తొలి మ్యాచ్‌లో శ్రీలంకపై భారత్-ఏ 77 పరుగుల తేడాతో
విజయం సాధించింది. తొలుత భారత్-ఏ నిర్ణీత 20 ఓవర్లలో ఒక వికెట్‌కు 175
పరుగులు చేసింది. అనంతరం శ్రీలంక 20 ఓవర్లలో 9 వికెట్లకు 98 పరుగులు మాత్రమే
చేయగలిగింది. మధ్యాహ్నం జరిగిన మ్యాచ్‌లో భారత్-బి జట్టు 8 వికెట్లతో
వెస్టిండీస్ పై గెలుపొందింది. తొలుత వెస్టిండీస్ 16.5 ఓవర్లలో కేవలం 44
పరుగులకే ఆలౌటైంది. స్వల్ప లక్ష్యాన్ని భారత్-బి 7.1 ఓవర్లలో రెండు వికెట్లు
కోల్పోయి ఛేదించింది. ఫైనల్ శనివారం జరగనుంది.