జాతీయ అత్యున్నత క్రీడాపురస్కారం మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న పురస్కారానికి
తెలుగుతేజం, కామన్వెల్త్ గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్ ఆచంట శరత్ కమల్ ఎంపికయ్యాడు.
ఈ మేరకు జాతీయ క్రీడాపురస్కారాలను కేంద్ర క్రీడామంత్రిత్వశాఖ ప్రకటించింది.
దేశానికి అంతర్జాతీయంగా ఖ్యాతి తెచ్చిన వివిధ క్రీడలకు చెందిన మొత్తం 25 మంది
క్రీడాకారులకు అవార్డులను ప్రకటించారు. ఖేల్ రత్న, అర్జున, జీవన సాఫల్య
పురస్కారాలను ఈనెల 30న రాష్ట్ర్రపతి భవన్ లో జరిగే ఓ కార్యక్రమంలో
అందచేయనున్నారు. అదేవిధంగా, మహిళల బాక్సింగ్ లో కామన్వెల్త్ గోల్డ్ మెడలిస్ట్
నిఖత్ జరీన్, టేబుల్ టెన్నిస్ ప్లేయర్ ఆకుల శ్రీజలకు అర్జున అవార్డులను
ప్రకటించారు. బ్యాడ్మింటన్ యువ ఆటగాడు లక్ష్యసేన్, డిస్కస్ త్రోయర్
సీమా పూనియా సైతం అర్జున అవార్డుకు ఎంపికైనవారిలో ఉన్నారు. కేరళ బ్యాడ్మింటన్
ప్లేయర్ ప్రణయ్, ఎల్దోసీ పాల్ అర్జున పురస్కారాలకు, అవినాశ్ సాబ్లే, జీవన్
జోత్ సింగ్ తేజా, సుమన్ శిరూర్, సుజీత్ మాన్ ద్రోణాచార్య అవార్డులు
అందుకోనున్నారు.