12 జట్ల మధ్య జరిగిన టీ20 ప్రపంచకప్‌లో తుది విజేతగా ఇంగ్లండ్ గెలిచింది.
2019లో వన్డే ప్రపంచకప్, 2022లో టీ20 ప్రపంచకప్‌లను గెల్చుకున్న ఇంగ్లండ్
జట్టు విజయానికి కారణమైంది రెండు సందర్భాల్లోనూ ఒకడే కావడం విశేషం. అతడే
ఇంగ్లండ్ అల్రౌండర్ బెన్‌స్టోక్స్. ఇంగ్లండ్ విజయంలో కీలకపాత్ర పోషించింది
బెన్‌స్టోక్స్‌నే. చివరి వరకూ 52 పరుగులతో నిలిచి జట్టు విజయానికి
కారణమయ్యాడు. బౌలింగ్‌లో కూడా కీలకమైన వికెట్లు పడగొట్టాడు. పవర్‌ప్లేలో మూడు
వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న ఇంగ్లండ్ జట్టును ఆదుకుంది
బెన్‌స్టోక్స్‌నే. హ్యారీ బ్రూక్‌తో కలిసి ముఖ్యమైన భాగస్వామ్యం నెలకొల్పాడు.
విన్నింగ్ షాట్ కూడా స్టోక్స్‌దే. ఈ తరుణంలో వన్డే కెరీర్ నుంచి రిటైర్మెంట్
కావాలని అనుకుంటున్న స్టోక్స్ నిర్ణయంపై వెటరన్ క్రికెటర్లు స్పందించారు.
బెన్ స్టోక్స్ తన వన్డే రిటైర్మెంట్ను పునరాలోచించి, వచ్చే ఏడాది 50 ఓవర్ల
ప్రపంచ కప్‌లో తన జట్టును రక్షించడంలో కీలకంగా వ్యవహరించాలని ఇంగ్లాండ్ మాజీ
కెప్టెన్ మైఖేల్ వాన్ ఆశించాడు. పాకిస్థాన్‌పై.. ఆదివారం మెల్బోర్న్ క్రికెట్
గ్రౌండ్ లో జరిగిన ఉత్కంఠభరితమైన మ్యాచ్ అనంతరం మైఖేల్ వామ్ ఈ వ్యాఖ్యలు చేయడం
విశేషం.