త్వరలో భారత్‌లో జరగబోయే ఐపీఎల్‌పై ఇప్పటినుంచే సన్నాహాలు,
ట్రేడింగ్‌లు కొనసాగుతున్నాయి. తాజాగా ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై
ఇండియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు చెందిన జాసన్ బెహ్రెన్‌డార్ఫ్‌ను
ట్రేడింగ్ చేసి జట్టులోకి చేర్చుకుంది. ముంబై ఇండియన్స్, బెంగుళూరు జట్లు
నవంబర్ 12, శనివారం జాసన్ బెహ్రెన్‌డార్ఫ్ ట్రేడింగ్‌ను ప్రకటించాయి.
ఆస్ట్రేలియాకు చెందిన ఫాస్ట్ బౌలర్ బెహ్రెన్‌డార్ఫ్ ను ఈ ఏడాది ప్రారంభంలో
జరిగిన మెగా వేలంలో బెంగళూరు రాయల్‌చాలెంజ్ ప్రాంచైజీ కొనుగోలు చేసింది.
బెహ్రెన్‌డార్ఫ్‌ను కొనుగోలు చేయడానికి, ఆర్.సీ.బీ. వేలంలో కేవలం రూ. 75
లక్షలు మాత్రమే వెచ్చించింది. ఇది ఆస్ట్రేలియా బౌలర్ ప్రాథమిక ధరగా నిలిచింది.
అయితే, అతను ఐపీఎల్ 2022 సీజన్లో బెంగళూరు తరపున ఒక్క మ్యాచ్ కూడా
ఆడలేకపోయాడు. ఈ తరుణంలో ఐపీఎల్లో శక్తివంతమైన జట్టుగా పేరొందిన ముంబై
ఇండియన్స్ శనివారం బెహ్రెన్‌డార్ఫ్ ట్రేడ్ గురించి తెలియజేస్తూ ఒక ప్రకటన
విడుదల చేసింది. ఫ్రాంచైజీ ప్రకటన ప్రకారం, ఆసీస్ ఫాస్ట్ బౌలర్ 2018, 2019
సీజన్లలో టైటిల్‌ను గెలుచుకున్నప్పుడు ముంబై జట్టులో ఉన్నాడు. ఇప్పుడు 2023
సీజన్లో అతనిని మళ్లీ ముంబై జట్టులో చూస్తారంటూ ముంబై ప్రాంచైజీ ఓ ట్వీట్
చేసింది.